ETV Bharat / sitara

'ఎఫ్​ 2' రీమేక్​లో హీరోగా అర్జున్​కపూర్​! - బోనీ కపూర్​ ఎఫ్​ 2 రీమేక్

అనిల్​ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్​-వరుణ్​తేజ్​ హీరోలుగా నటించిన చిత్రం 'ఎఫ్​ 2'. ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో రీమేక్​ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వరుణ్​తేజ్​ పాత్రలో బాలీవుడ్​ హీరో అర్జున్​ కపూర్​ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది.

Arjun Kapoor locked for F2's Hindi remake
'ఎఫ్​ 2' రీమేక్​లో హీరోగా అర్జున్​కపూర్​!
author img

By

Published : Apr 6, 2021, 7:05 AM IST

వెంకటేశ్​-వరుణ్‌ తేజ్‌ కలిసి నటించిన చిత్రం 'ఎఫ్2'. ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌ అనేది ఉపశీర్షిక. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్‌రాజు నిర్మించారు. 2019 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. ఇందులో కథానాయికలుగా తమన్నా, మెహరీన్‌ నటించి అలరించారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెలుగులో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 3'గా చిత్రీకరణ జరుపుకొంటోంది. అయితే 'ఎఫ్‌2' చిత్రానికి సంబంధించి హిందీ రీమేక్‌ను బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌తో కలిసి దిల్‌రాజు నిర్మించనున్నారని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. త్వరలోనే చిత్రాన్ని హిందీలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ఇందులో వరుణ్‌ తేజ్‌ పాత్రలో బోనీ తనయుడు అర్జున్ కపూర్‌ను తీసుకున్నట్లు సమాచారం. వెంకటేశ్​ పాత్రలో ఎవరు నటిస్తారనేది దానిపై ఇంకా ఓ కొలిక్కి రాలేదట. కామెడీ చిత్రాల స్పెషలిస్ట్‌ అనీష్‌ బజ్మీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. కథానాయికలు ఎవరేనేది స్పష్టత రాలేదు.

ఇదీ చూడండి: ప్రధాని మోదీని కలిసిన నంబీ నారాయణ్​, మాధవన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.