ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్.. సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. మన దేశంలోని ప్రతిభావంతులను వెలికితీసేందుకు 'ఫ్యూచర్ ఫ్రూఫ్' పేరుతో ఓ కాన్ఫరెన్స్ వెబ్ సిరీస్‌ను రూపొందించనున్నారు.
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, ఆస్కార్ విజేతలు నిక్ వెల్లెలొంగా, బెర్నార్డ్ హిల్లర్ దీనిని పర్యవేక్షించనున్నారు. జోయా అక్తర్, నందితా దాస్, అనుభవ్ సిన్హా, హన్షల్ మెహతా, నీరజ్ గయ్వాన్, లిజో జోస్ పెలిసెర్రీ, గీతూ మోహన్‌దాస్ లాంటి దర్శకులు ఇందులో భాగం కానున్నారు.
మన భవిష్యత్తు సినిమాను, ప్రతిభావంతులను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టడమే 'ఫ్యూచర్ ఫ్రూఫ్' తొలి సీజన్ లక్ష్యమని రెహమాన్ స్పష్టం చేశారు. భారతీయ సృజనాత్మకత, కళాత్మక ఆలోచనలను సులభతరం చేయాల్సిన అవసరం ఉందని తాను భావించానని, అందుకే 'ఫ్యూచర్ ఫ్రూప్'కు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.
ఇది చదవండి: ఏఆర్ రెహ్మన్నూ వదలని మూవీ మాఫియా!