ETV Bharat / sitara

'ఆక్వామాన్​' సీక్వెల్​లో హారర్​ కంటెంట్​ - ఆక్వామ్యాన్​2లో హర్రర్​ కంటెంట్​

'ఆక్వామాన్​' సీక్వెల్​లో హారర్ కంటెంట్​ ఉంటుందని స్పష్టం చేశాడు ఆ చిత్ర దర్శకనిర్మాత జేమ్స్​ వాన్​. దీంతోపాటు సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలనూ పంచుకున్నాడు.

Aquaman sequel will include elements of horror
'ఆక్వామాన్​' సీక్వెల్​లో హర్రర్​ కంటెంట్​
author img

By

Published : Aug 17, 2020, 7:54 PM IST

'ఆక్వామాన్​' సినిమా సీక్వెల్​ గురించి ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నాడు ఆ చిత్ర దర్శకనిర్మాత జేమ్స్​ వాన్​. ఇందులో భయానక సన్నివేశాలుంటాయని ఇటీవలే వెల్లడించాడు.

"నా మొదటి చిత్రం 'సా'లో హర్రర్​ కంటెంట్​ను కొద్దిగా చూపించినా.. ఈ చిత్రంలో అలాంటి సన్నివేశాలు కొన్ని ఎక్కువగానే ఉంటాయి. భయానక చిత్రాలను నిర్మించడం నాలో భాగమని నేను అనుకుంటా. అందుకే నా నుంచి అలాంటి చిత్రాలు వస్తాయి" అని తెలిపాడు జేమ్స్​ వాన్​.

'ఆక్వామాన్​' ఫ్రాంచైజీలో తొలి చిత్రం 2018లో విడుదలైంది. ఈ చిత్ర నిర్మాత జేమ్స్​ వాన్​.. 'కం​జూరింగ్​' సిరీస్​లోనూ భాగమయ్యాడు. హెచ్​బీఓ మ్యాక్స్​ కోసం ఆక్వామాన్​ యానిమేషన్​ ఎపిసోడ్లను నిర్మిస్తున్నాడు. ఈ ఆక్వామాన్ సీక్వెల్​ చిత్రం 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.