ప్రముఖ నటి అనుష్క శెట్టి మళ్లీ బొద్దుగా కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. 'సైజ్ జీరో' సినిమా కోసం భారీగా బరువు పెరిగిన ఈ అమ్మడు... ఇటీవల 'నిశబ్దం' అనే చిత్ర షూటింగ్‌లో స్లిమ్ లుక్‌లో కనిపించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న స్వీటీ... తాజాగా హైదరాబాద్ విమానాశ్రయంలో కెమెరా కంటికి చిక్కింది. ఇందులో మళ్లీ చబ్బీ చబ్బీగా దర్శనమిచ్చిందీ బొమ్మాళీ.

నిశబ్దంలో అనుష్కకు జంటగా మాధవన్ నటిస్తున్నాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ వెండితెరపై సందడి చేయనున్నారు. హేమంత్ మధుకర్ దర్శకుడు. అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస అవసరాల లాంటి తారాగణం ఇందులో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటోంది. వచ్చే ఏడాది జనవరిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చదవండి...బోల్డ్ పాత్రతో కన్నడలోకి ప్రియా వారియర్