హీరోయిన్ అనుష్క పెళ్లి త్వరలో జరగనుందంటూ, గత కొన్ని వారాల నుంచి ఒకటే వార్తలు. ఈమెను వివాహం చేసుకోబోయేది ఓ టీమిండియా క్రికెటర్ అని, విడాకుల తీసుకున్న టాలీవుడ్ దర్శకుడు ఆమెను వివాహం చేసుకోనున్నాడని ప్రచారం సాగుతోంది. అయితే ఈ పుకార్లు అన్నింటికీ పుల్‌స్టాప్ పెట్టింది స్వీటీ. గురువారం జరిగిన ఓ ఈవెంట్లో ఈ విషయం గురించి పూర్తి స్పష్టతనిచ్చింది.
"ఇప్పటివరకు వచ్చిన వార్తలన్నీ అబద్ధం. నా పెళ్లి గురించి ఎందుకంత చర్చ చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఎవరైనా రిలేషన్‌షిప్‌ను దాయరు కదా. పెళ్లి గురించి ఎలా దాస్తానని అనుకున్నారు. అందరిలానే వివాహం అనేది నా జీవితంలోనూ ప్రత్యేకమే. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే నేనే మీకు చెప్తా" -అనుష్క శెట్టి, హీరోయిన్
'బాహుబలి' సిరీస్, 'భాగమతి' తర్వాత ఆమె నటిస్తున్న సినిమా 'నిశ్శబ్దం'. ఇటీవలే వచ్చిన ట్రైలర్ అంచనాల్ని పెంచుతోంది. వచ్చే నెల 2న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">