ETV Bharat / sitara

కోహ్లీని ఎత్తుకున్న అనుష్క.. వీడియో వైరల్ - Anushka Sharma shares video of lifting hubby Virat Kohli

తన భర్త విరాట్ కోహ్లీని ఎత్తుకుని అందరినీ షాక్​కు గురి చేసింది బాలీవుడ్ నటి అనుష్క శర్మ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

Kohli, Anushka
కోహ్లీ, అనుష్క
author img

By

Published : Apr 7, 2021, 2:11 PM IST

Updated : Apr 7, 2021, 2:39 PM IST

తన భర్త, టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీని ఎత్తుకుని అందరికీ షాకిచ్చింది బాలీవుడ్ నటి అనుష్క శర్మ. దీనికి సంబంధించిన వీడియోను ఇన్​స్టాలో పోస్ట్ చేసిందీ నటి. ఇప్పుడు ఇది నెట్టింట తెగ వైరల్​గా మారింది.

ఓ ప్రకటన షూటింగ్ జరుగుతోన్న సమయంలో సెట్​కు వెళ్లిన అనుష్క.. వెనుక నుంచి కోహ్లీని కౌగిలించుకుంది. ఆ తర్వాత అతడిని పైకి లేపింది. ఇది చూసి షాకైన కోహ్లీ మరోసారి లిఫ్ట్ చేయాలని కోరాడు. దీంతో మరోసారి కోహ్లీని పైకెత్తింది అనుష్క. ఈ వీడియోను ఇన్​స్టాలో పోస్ట్ చేసిన ఈ హీరోయిన్ "ఇది నేనే చేశానా?" అంటూ ఆశ్చర్యపోయింది.

ప్రస్తుతం ఐపీఎల్​తో బిజీగా ఉన్నాడు విరాట్ కోహ్లీ. లీగ్ ప్రారంభానికి ముందు పలు బ్రాండ్ల షూటింగ్​ల్లో పాల్గొంటున్నాడు. అలాగే ఆర్సీబీ, ఐపీఎల్​కు సంబంధించిన ప్రకటనలూ చేస్తున్నాడు. కాగా, ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అనుష్క తిరిగి షూటింగ్​ల్లో పాల్గొంటోంది.

Last Updated : Apr 7, 2021, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.