ETV Bharat / sitara

'పాయల్​తోనే కాదు.. ఎవరితోనూ అలా ప్రవర్తించలేదు' - పాయల్​ ఘోష్ అనురాగ్​ కశ్యప్

నటి పాయల్​ ఘోష్​ తనపై చేసిన లైంగిక ఆరోపణలపై బాలీవుడ్​ దర్శకనిర్మాత అనురాగ్​ కశ్యప్​ స్పందించాడు. ఆమె చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని ట్విట్టర్​లో వెల్లడించాడు. తనతో పనిచేసిన ఏ మహిళా కళాకారులతోనూ తాను ఆ విధంగా ప్రవర్తించలేదని స్పష్టం చేశాడు.

Anurag Kashyap refutes sexual harassment charges levelled by Payal Ghosh
ఆమెతోనే కాదు.. ఎవరితోనూ అలా ప్రవర్తించలేదు: అనురాగ్​
author img

By

Published : Sep 20, 2020, 11:53 AM IST

బాలీవుడ్​లో క్యాస్టింగ్ కౌచ్ వివాదం గురించి కొందరు హీరోయిన్లు బయటపెట్టిన నిజాలు సంచలనం రేపాయి. తాజాగా దర్శకుడు అనురాగ్ కశ్యప్​పై నటి పాయల్ ఘోష్ తీవ్ర ఆరోపణలు చేసింది. కశ్యప్ తనను బలవంతం చేయడానికి ప్రయత్నించాడంటూ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీనిపై ప్రధానమంత్రి మోదీని ట్యాగ్​ చేస్తూ ఫిర్యాదు చేసింది పాయల్.

Anurag Kashyap refutes sexual harassment charges levelled by Payal Ghosh
పాయల్​ ఘోష్​ ట్వీట్​

పాయల్​ ఘోష్​ తనపై చేసిన లైంగిక ఆరోపణల్లో నిజం లేదని బాలీవుడ్​ దర్శకనిర్మాత అనురాగ్​ కశ్యప్ అన్నాడు​. ఈ విషయంపై ట్విట్టర్​లో స్పందించిన కశ్యప్​.. ఇలాంటి అసత్య ప్రచారంతో తన నోరు మూయించే పని చేస్తున్నారని వెల్లడించాడు.

  • क्या बात है , इतना समय ले लिया मुझे चुप करवाने की कोशिश में । चलो कोई नहीं ।मुझे चुप कराते कराते इतना झूठ बोल गए की औरत होते हुए दूसरी औरतों को भी संग घसीट लिया। थोड़ी तो मर्यादा रखिए मैडम। बस यही कहूँगा की जो भी आरोप हैं आपके सब बेबुनियाद हैं ।१/४

    — Anurag Kashyap (@anuragkashyap72) September 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • मैं इस तरह का व्यवहार ना तो कभी करता हूँ ना तो कभी किसी क़ीमत पे बर्दाश्त करता हूँ । बाक़ी जो भी होता है देखते हैं । आपके विडीओ में ही दिख जाता है कितना सच है कितना नहीं , बाक़ी आपको बस दुआ और प्यार ।आपकी अंग्रेज़ी का जवाब हिंदी में देने के लिए माफ़ी ।

"నా నోరు మూయించడానికి మీకు ఇంత సమయం పట్టింది, ఫర్వాలేదు. మీరు పెద్ద అబద్ధం చెప్పారు. మీతో పాటు ఇతర మహిళలను ఇందులోకి లాగారు. కొంచెం హుందాగా ప్రవర్తించండి మేడమ్​. మీరు చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవి. నాపై ఆరోపణలు చేయడం సహా బచ్చన్​ కుటుంబాన్ని ఇందులోకి లాగారు. మేడమ్​, నేను రెండుసార్లు వివాహం చేసుకున్నా. అది నేరమే అయితే దాన్ని నేను అంగీకరిస్తున్నా. నా మొదటి భార్యనైనా, రెండో భార్యనైనా చాలా ప్రేమించా. నేను ఇంతవరకు పనిచేసిన మహిళా కళాకారులెవరితోనూ ఆ విధంగా ప్రవర్తించలేదు. అలాంటి ప్రవర్తనను నేనూ అంగీకరించను. ఈ విషయంలో ఏమి జరగబోతుందో చూద్దాం."

- అనురాగ్​ కశ్యప్​, బాలీవుడ్ దర్శకనిర్మాత

దీనిపై స్పందించిన జాతీయ మహిళా సంఘం ఛైర్మన్ రేఖా శర్మ అందుకు సంబంధించిన వివరాలు తమకు పంపాల్సిందిగా ట్విట్టర్​లో పాయల్​ ఘోష్​కు సూచించారు. దీనిపై విచారణ చేపడతామని నటికి భరోసా ఇచ్చారు.

మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన 'ప్రయాణం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పాయల్. ఆ తర్వాత ఎన్టీఆర్​తో 'ఊసరవెల్లి'లోనూ నటించింది. పలు సినిమాలు చేసినా తగిన గుర్తింపు రాలేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.