క్రికెటర్ బుమ్రా పెళ్లి హీరోయిన్ అనుపమతో జరగనుందనే వార్త మరోసారి జోరందుకుంది. ప్రస్తుతం దీని గురించే సోషల్ మీడియాలో తెగ మాట్లాడేసుకుంటున్నారు.
అసలు ఏమైంది?
ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు బుమ్రా వ్యక్తిగత కారణాలతో దూరమై సొంతూరుకు వెళ్లాడు. దీంతో అతడి పెళ్లి త్వరలో జరగనుందనే వార్తలు తెగ వచ్చాయి. సరిగ్గా అదే సమయంలో హాలీడే ట్రిప్ కోసం గుజరాత్ వెళ్తున్నానని హీరోయిన్ అనుపమ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ పెట్టింది.
దీంతో బుమ్రాను ఈమె వివాహం చేసుకుంటుందా? లేదా అక్కడికి వెళ్లేందుకు మరేదైనా కారణం ఉందా? అని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. కొన్నాళ్లు ఆగితే తప్ప దీని గురించి క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు.
ఇది చదవండి: '18 పేజీస్'లోకి 18వ రోజు వచ్చిన అనుపమ!