*నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' చిత్ర రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 29న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇందులో కృతిశెట్టి హీరోయిన్. ఎస్.ఆర్.శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది.

*బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్(shahid kapoor movies).. మరో సినిమా మొదలుపెట్టేశారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ యాక్షన్ సినిమా.. దుబాయ్‌లో ప్రారంభమైంది. ఈ కథానాయకుడు నటించిన 'జెర్సీ'(తెలుగు 'జెర్సీ'కి రీమేక్(jersey remake)) విడుదల కావాల్సి ఉంది.

*సల్మాన్‌ఖాన్-ఆయుష్ శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'అంతిమ్'(antim release date). ఇందులో 'చింగారి' సాంగ్‌ను(chingari song lyrics) శుక్రవారం రిలీజ్ చేశారు. వాలుశ్చా డిసౌజా ఈ పాటలో నర్తించింది. మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. నవంబరు 26న థియేటర్లలోకి రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
*విక్కీ కౌశల్(vicky kaushal new movie)-కియారా అడ్వాణీ- భూమి పెడ్నేకర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త సినిమా 'గోవిందా నామ్ మేరా'. ఫస్ట్‌లుక్స్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ముద్దుగుమ్మలు ఇద్దరూ చీరలో కనిపించగా, విక్కీ.. క్రేజీ లుక్‌లో కనిపించారు. శశాంక్ కైతాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది జూన్ 10న థియేటర్లలోకి రానుంది.

*వరుణ్‌తేజ్ 'గని' సినిమాలోని(ghani release date) నదియా పాత్ర ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. అక్షయ్ కుమార్ 'పృథ్వీరాజ్' ట్రైలర్‌ను(prithviraj movie trailer) వచ్చే వారం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో మానుషి చిల్లర్ హీరోయిన్. సంజయ్ దత్, సోనూసూద్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.


ఇవీ చదవండి: