'ఇళయ దళపతి' విజయ్ కథానాయకుడిగా లోకేశ్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'మాస్టర్'. ఆండ్రియా, మాళవిక మోహనన్ కథానాయికలు. విజయ్ సేతపతి ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో.. విజయ్ ఆలపించిన 'కుట్టి స్టోరీ' పాట లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఇది విడుదలైన దాదాపు 6 గంటల్లోనే 5 మిలియన్ల వీక్షణలు సొంతం చేసుకుంది.
-
#Thalapathy's #KuttiStory crosses a whopping 5️⃣ MILLION real-time views😎
— #MASTER (@MasterOfficiaI) February 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
1M Views - 29 Mins
2M Views - 1Hr 21Mins
3M Views - 2Hrs 19Mins
4M Views - 3Hrs 55Mins
5M Views - 5Hrs 52Mins#KuttiStoryRecords @actorvijay @anirudhofficial @Arunrajakamaraj @MasterOfficiaI #Master pic.twitter.com/E9Okma6xTX
">#Thalapathy's #KuttiStory crosses a whopping 5️⃣ MILLION real-time views😎
— #MASTER (@MasterOfficiaI) February 14, 2020
1M Views - 29 Mins
2M Views - 1Hr 21Mins
3M Views - 2Hrs 19Mins
4M Views - 3Hrs 55Mins
5M Views - 5Hrs 52Mins#KuttiStoryRecords @actorvijay @anirudhofficial @Arunrajakamaraj @MasterOfficiaI #Master pic.twitter.com/E9Okma6xTX#Thalapathy's #KuttiStory crosses a whopping 5️⃣ MILLION real-time views😎
— #MASTER (@MasterOfficiaI) February 14, 2020
1M Views - 29 Mins
2M Views - 1Hr 21Mins
3M Views - 2Hrs 19Mins
4M Views - 3Hrs 55Mins
5M Views - 5Hrs 52Mins#KuttiStoryRecords @actorvijay @anirudhofficial @Arunrajakamaraj @MasterOfficiaI #Master pic.twitter.com/E9Okma6xTX
అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలకు అనురాజా కామరాజ్ సాహిత్యం అందించాడు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. అంతేకాదు, ఈ లిరికల్ వీడియోను డిజైన్ చేసిన విధానమూ ఆకట్టుకుంటోంది. అనిరుధ్ 'వై దిస్ కోలవెరి'ని గుర్తు చేస్తోంది. వేసవి కానుకగా ఏప్రిల్ 9న సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
కథ చోరీ..?
ఈ సినిమా ఘన విజయం సాధించిన కొరియన్ చిత్రం 'సైలెన్స్‌డ్' కాపీ అంటూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరిగింది. ఆ కొరియన్ చిత్రంలో మూగ, చెవుడు వంటి ప్రత్యేక ప్రతిభావంతులను కథానాయకుడు కాపాడుతుంటాడు. అలాగే వారిపై జరిగే లైంగిక దాడులను అడ్డుకునే వ్యక్తిగా హీరోగా కనిపిస్తాడు. అలాంటి కథతోనే 'మాస్టర్'ను కూడా తెరకెక్కిస్తున్నారని నెటిజన్లు చెబుతున్నారు. ఇందుకు చెన్నైలోని ప్రత్యేక ప్రతిభావంతుల చిన్నారుల వసతి గృహంలో చిత్రీకరణ జరపడమే కారణం. అయితే ఈ పుకార్లను చిత్రవర్గాలు ఖండించాయి. సినిమా విడుదలైతే ఆ విషయం స్పష్టమవుతుందని చెబుతున్నాయి. కొంత కాలంగా విజయ్ చిత్రాలన్నీ 'కథ చోరీ' వ్యవహారంలో చిక్కుకుంటున్నాయి. 'మాస్టర్'కు అలాంటి సమస్యలు రాకూడదని అభిమానులు కోరుకుంటున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">