ప్రస్తుతం క్రీడా బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే మేరీకోమ్, మిల్కా సింగ్, ధోనీ లాంటి క్రీడాకారుల జీవిత చరిత్రలను తెరపైకి తీసుకొచ్చారు. తాజాగా ఒలింపిక్స్ స్వర్ణ పతక గ్రహీత అభినవ్ బింద్రా బయోపిక్ రానుంది. ఇందులో బింద్రా తండ్రి పాత్రను అనిల్ కపూర్ పోషిస్తుండగా... అతని కుమారుడు అభినవ్ పాత్రలో మెప్పించనున్నాడు.
ఇటీవలే అభినవ్ బింద్రా తండ్రి అపజీత్ బింద్రాను కలిశాడు అనిల్ కపూర్. కన్నన్ అయ్యర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.
-
Great stories take time to be told! The world will see the inspirational life story of @Abhinav_Bindra on the big screen soon! So incredibly excited for this! @apjitbindra @HarshKapoor_ pic.twitter.com/0OtUkq2LJ4
— Anil Kapoor (@AnilKapoor) July 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Great stories take time to be told! The world will see the inspirational life story of @Abhinav_Bindra on the big screen soon! So incredibly excited for this! @apjitbindra @HarshKapoor_ pic.twitter.com/0OtUkq2LJ4
— Anil Kapoor (@AnilKapoor) July 3, 2019Great stories take time to be told! The world will see the inspirational life story of @Abhinav_Bindra on the big screen soon! So incredibly excited for this! @apjitbindra @HarshKapoor_ pic.twitter.com/0OtUkq2LJ4
— Anil Kapoor (@AnilKapoor) July 3, 2019
"గొప్ప కథలు చెప్పడానికి అర్హత కావాలి. అభినవ్ బింద్రా విజయం వెనక ఉన్న అతడి కుటుంబ పాత్రను తెలుసుకునే అవకాశం మాకు దక్కింది. ఈ సినిమాను వెండి తెరపైకి తీసుకొచ్చేందుకు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాం" - అనిల్ కపూర్, బాలీవుడ్ నటుడు.
2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించాడు అభినవ్ బింద్రా. 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఈ ఘనత సాధించాడు. వ్యక్తిగత విభాగంలో పసిడి కైవసం చేసుకున్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు అభినవ్ బింద్రా.
ఇది చదవండి: సినీ డైరీ: నిర్మాత ఒప్పుకోలేదు.. 50 వారాలు ఆడింది