ETV Bharat / sitara

చెల్లితో జాన్వీ కపూర్ గొడవ.. హోటల్​ నుంచి బయటకు - జాన్వీ కపూర్ ఖుషీ కపూర్

నటి జాన్వీ కపూర్​ చేసిన క్రేజీ విషయాన్ని వెల్లడించించింది ఆమె స్నేహితులరాలు తనీషా. స్పెయిన్​లో ఓసారి చెల్లితో గొడవపడిన​ జాన్వీ.. హోటల్​ నుంచి బయటకు వెళ్లిపోయిందని చెప్పింది. అందుకు గల కారణాన్ని తెలిపింది.

Angry with Khushi and BFF, Janvhi once walked out of hotel room in Barcelona
చెల్లితో జాన్వీ కపూర్ గొడవ.. హోటల్​ నుంచి బయటకు
author img

By

Published : Jan 19, 2021, 3:35 PM IST

అందాల తార శ్రీదేవి కుమార్తె, హీరోయిన్ జాన్వీ కపూర్​ను చూస్తే చాలా నెమ్మదిగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఆమె ఎంత అల్లరి పిల్లో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం పక్కా! దీని గురించి ఓ ఉదాహరణ కూడా చెప్పింది జాన్వీ బెస్ట్ ఫ్రెండ్ తనీషా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె, గతంలో స్పెయిన్ వెకేషన్​లో జాన్వీ చేసిన అల్లరి పని గురించి వెల్లడించింది.

janhvi kapoor tanisha santoshi
స్నేహితురాలు తనీషాతో జాన్వీ కపూర్

"ఓసారి నేను, జాన్వీ, ఖుషీ కలిసి స్పెయిన్​ వెళ్లాం. ఓరోజు బయటకెళ్దామని చెబితే, జాన్వీ హోటల్​లోనే ఉంటానని చెప్పింది. దీంతో నేను, ఖుషీ బయటకు వెళ్లాలని నిర్ణయించుకునే సరికి.. ఒక్కదానినే వదిలేసి వెళ్లిపోతున్నారా అంటూ గొడవ పెట్టుకుంది. సరేకదా అని మేం హోటల్​లోనే ఉండిపోయాం. ఆ తర్వాత జాన్వీ, మాకు ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. ఆమెను ఎవరైనా పట్టుకుని వెళ్లిపోయారేమో మేం భయపడ్డాం. ఏడుస్తూ కూర్చున్నాం. జాన్వీ మాత్రం తాపీగా ఐస్​క్రీమ్​లు తింటూ బార్సిలోనా వీధులన్ని తిరుగుతూ హోటల్​కు తిరిగొచ్చింది" అని తనీషా గతంలో జరిగిన సంఘటనను వివరించింది.

ఓటీటీలో గతేడాది విడుదలైన 'గుంజన్ సక్సేనా' సినిమాతో అలరించిన జాన్వీ, ప్రస్తుతం 'రుహీ అఫ్జానా', 'దోస్తానా 2', 'గుడ్​లక్ జెర్రీ' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

janhvi kapoor tanisha santoshi
స్నేహితురాలు తనీషాతో జాన్వీ కపూర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.