బాలీవుడ్ నటి దిశా పటానీ నటించిన తాజా చిత్రం 'మలంగ్'. ఇందులో పాత్ర కోసం హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీని ఆదర్శంగా తీసుకున్నట్టు తెలిపిందీ అమ్మడు. ఈ చిత్రంలో వ్యతిరేక ఛాయలున్న పాత్రలో నటించటం ఓ కొత్త అనుభూతిని ఇచ్చిందని వెల్లడించింది దిశా.
"మలంగ్' కథ విన్న కొద్ది నిమిషాల్లోనే ఈ సినిమాకు ఓకే చెప్పేశాను. ఎందుకంటే ఇలాంటి పాత్రలు అమ్మాయిలు అరుదుగా పోషిస్తారు. వ్యతిరేక ఛాయలున్న పాత్రలు చేయాలంటే చాలా ఇష్టం. హలీవుడ్లో నెగటివ్ రోల్స్ చేస్తున్న ఏంజెలీనా జోలీనే ఆదర్శంగా తీసుకున్నాను. ఈ సినిమాలోని పాత్ర కోసం ఆమె నటించిన కొన్ని సన్నివేశాలను చూసి స్ఫూర్తి పొందాను. ఈ చిత్రంలో హీరోతో చేసిన రొమాంటిక్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని అందరూ ప్రశంసిస్తున్నారు."
- దిశా పటానీ, బాలీవుడ్ నటి
కెరీర్ ఆరంభంలోనే పూరి జగన్నాథ్, నీరజ్ పాండే, అలీ అబ్బాస్ జాఫర్ లాంటి అగ్ర దర్శకులతో పని చేయటం అదృష్టంగా భావిస్తున్నట్లు దిశా తెలిపింది. 'మలంగ్' చిత్రంలో హీరోగా ఆదిత్యా కపూర్, ప్రధాన పాత్రల్లో అనీల్ కపూర్, కునాల్ కెమ్మూ నటించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి.. 'జాను' సాంగ్ : 'ఊహలే ఊహలే' అంటూ ఊహల్లో తేలిపోవాల్సిందే