Anee Master Corona: ప్రముఖ కొరియోగ్రాఫర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అనీ మాస్టర్ కరోనా బారినపడ్డారు. ఆమె వైరస్ బారిన పడటం ఇది రెండోసారి. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తనలాగే కరోనా నాలానే టైం మెయిన్టైన్ చేస్తోందన్న అనీ... గతేడాది 2021 జనవరి 23న కొవిడ్ నెగిటివ్ వచ్చిందన్నారు. మళ్లీ ఈ సంవత్సరం జనవరి 23 తర్వాత కరోనా సోకిందని తెలిపారు. ఈ క్వారంటైన్ చాలా బోరింగ్‌గా, చిరాగ్గా ఉందని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తన ఇస్టాగ్రామ్ స్టోరీలో చెప్పుకొచ్చారు.
థర్డ్ వేవ్‌లో చాలా మంది సెలబ్రెటీలు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. అన్నీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు దీని బారిన పడుతున్నారు. ప్రజంతా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: