ప్రముఖ వ్యాఖ్యాత, నటుడు ప్రదీప్.. మరో సినిమాకు సిద్ధమయ్యారు. రానున్న జనవరిలో ఆ కబురు చెబుతానని అన్నారు.
'30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమాతో హీరోగా ప్రదీప్ పరిచయం కావాలి. సరిగ్గా విడుదల తేదీన లాక్డౌన్ ప్రకటించడం వల్ల అలానే వాయిదా పడింది. అయితే చిత్ర నిర్మాత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే తన తొలి సినిమాను థియేటర్లో విడుదల చేస్తామని ప్రదీప్ చెప్పారు.
ఈ లాక్డౌన్లో చిత్ర పరిశ్రమలోని సన్నిహితుల నుంచి కొత్త కథలు విన్నానని ప్రదీప్ పేర్కొన్నారు. త్వరలో రెండో సినిమాపై ప్రకటన చేస్తానని అన్నారు. ప్రేక్షకులు అన్ని జాగ్రత్తలు తీసుకుని థియేటర్లలో సినిమాను ఆస్వాదించాలని కోరారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">