ETV Bharat / sitara

'ఛత్రపతి' రీమేక్​లో హీరోయిన్ కోసం పూరీతో రాయబారం! - మూవీ న్యూస్ లేటేస్ట్

'ఛత్రపతి' రీమేక్​లో హీరోయిన్​ కోసం చిత్రబృందం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ పాత్రలో అనన్యను నటింపజేసేందుకు పూరీ జగన్నాథ్​తో రాయబారం చేస్తోందని సమాచారం.

ananya pandey for bollywood chatrapathi remake?
అనన్య పాండే
author img

By

Published : Feb 21, 2021, 10:21 AM IST

కుటుంబకథా చిత్రాల్లో నటించి, టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్‌.. బాలీవుడ్‌లో లక్‌ను పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోన్నారు. 'ఛత్రపతి' హిందీ రీమేక్‌లో కథానాయకుడిగా నటించనున్నారు. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ఆయన అన్ని విధాలుగా సిద్ధమవుతున్నారు. త్వరలో షూటింగ్​ మొదలుకానున్న ఈ రీమేక్​లో హీరోయిన్​ ఎంపిక కోసం చిత్రబృందం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

ananya pandey for bollywood chatrapathi remake?
బెల్లంకొండ శ్రీనివాస్​తో వివి వినాయక్

భారీ ప్రాజెక్ట్‌గా ఎన్నో అంచనాల నడుమ రానున్న 'ఛత్రపతి' రీమేక్‌లో శ్రీనివాస్‌ సరసన కథానాయికగా ఎవరు నటించనున్నారనే దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్‌ హీరోయిన్స్‌ పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ వాళ్లు మాత్రం రీమేక్‌లో నటించడానికి ఆసక్తి కనబర్చడం లేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనన్యా పాండే ఇందులో నటించే అవకాశమున్నట్లు బాలీవుడ్‌లో టాక్‌. ఆమెతో ఈ ప్రాజెక్ట్ ఆఫర్‌ గురించి చెప్పమని చిత్రబృందం, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను సంప్రదించిందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. పూరీ తీస్తున్న 'లైగర్‌'లో అనన్యనే హీరోయిన్. ఆ చొరవతోనే ఆమెకు 'ఛత్రపతి' రీమేక్‌ గురించి చెప్పమని చిత్రబృందం ఆయనను కోరినట్లు తెలుస్తోంది.

ఇది చదవండి: పూరీ డైలాగ్స్​కే కాదు టైటిల్స్​కూ ఓ లెక్కుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.