ETV Bharat / sitara

'విజయ్​ చాలా సిగ్గరి.. 'లైగర్'​ ఓ పాప్​కార్న్​ మసాలా సినిమా' - విజయ్​ దేవరకొండ అనన్య పాండే

Ananya Panday Liger: 'లైగర్'​తో టాలీవుడ్​కు పరిచయం కానున్న బాలీవుడ్​ నటి అనన్య పాండే విజయ్​ దేవరకొండపై ప్రశంసలు కురిపించింది. విజయ్​ ఓ అద్భుతమైన కోస్టార్​ అని.. కానీ చాలా సిగ్గరి అంటూ చెప్పుకొచ్చింది. 'లైగర్​' ఓ పాప్​కార్న్​ మసాలా సినిమా అని పేర్కొంది.

ananya panday
అనన్య పాండే
author img

By

Published : Feb 20, 2022, 1:18 PM IST

Ananya Panday Liger: టాలీవుడ్​లో పాన్​ ఇండియా ట్రెండ్​ నడుస్తున్న నేపథ్యంలో తెలుగు సినిమాల్లో బాలీవుడ్​ బ్యూటీల హవా పెరిగింది. పూరి జగన్నాథ్​ దర్శతక్వంలో విజయ్​ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'లైగర్​' ఈ కోవకు చెందినదే. ఇందులో విజయ్​ సరసన అనన్య పాండే నటించింది. ఇటీవల ఆమె నటించిన 'గెహ్రాహియా' సినిమా విజయంతో జోష్​ మీద ఉన్న అనన్య 'లైగర్'​తో మరో హిట్​ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. తొలిసారిగా పాన్​ ఇండియా చిత్రంలో నటించిన ఈ భామ.. లైగర్​ ఒక పాప్​కార్న్​ మసాలా లాంటి సినిమా అని చెప్పుకొచ్చింది.

"లైగర్​ నా తొలి మసాలా సినిమా. నేను చెన్నై ఎక్స్​ప్రెస్​, గోల్​మాల్​ వంటి వినోదాత్మక చిత్రాలు చూస్తూ పెరిగాను. నాకు కూడా అలాంటి చిత్రాల్లో నటించాలని ఉండేది. డేవిడ్​ ధావన్, రోహిత్​ శెట్టి, ఫరాఖాన్​లకు నేను వీరాభిమానిని. నాకు ఈ లైగర్​ ఓ సూపర్​ పాప్​కార్న్​ మసాలా సినిమా. ఇందులో యాక్షన్, రోమాన్స్​, థ్రిల్లర్​, డ్రామా, కామెడీ అన్నీ ఉన్నాయి. అందులోనూ ఇది పాన్​ ఇండియా చిత్రం. నేను ఇంతకన్నా ఏమీ ఆశించను."

-అనన్య పాండే, 'లైగర్​' హీరోయిన్

విజయ్​ సిగ్గరి..

విజయ్​ దేవరకొండ నిజ జీవితంలో తెరమీద కనిపించిన దానికి భిన్నంగా ఉంటాడని అంటోంది అనన్య. అతను చేసే పాత్రలకు, వ్యక్తిత్వానికి అసలు సంబంధం ఉండదని పేర్కొంది. 'విజయ్​ చాలా సిగ్గరి, నెమ్మదస్తుడు. అతను ఓ అద్భుతమైన కోస్టార్​' అంటూ విజయ్​పై ప్రశంసలు కురిపించేసింది ఈ బ్యూటీ.

బాక్సింగ్​ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రముఖ బాక్సర్​ మైక్​ టైసన్​ కూడా నటించారు. ఈ నేపథ్యంలో మైక్​ టైసన్​తో పనిచేయడంపై స్పందిస్తూ ఆయన హుందాతనం చూసి ఫిదా అయిపోయానని తెలిపింది.

పూరీ కనెక్ట్స్​, ధర్మా ప్రొడక్షన్స్​లో సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి : ఆ ఫొటోలు చూసి షాకయ్యా: అనుపమ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.