ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మరోసారి బుల్లితెర ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమయ్యారు. భారతీయ టెలివిజన్ రంగంలోనే అత్యంత విజయవంతమైన షోగా 'కౌన్ బనేగా కరోడ్‌పతి'కి పేరుంది. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే తిరిగి ప్రారంభించనున్నట్లు సోనీ టీవీ ట్విట్టర్లో వెల్లడించింది.
-
Kya aap hain taiyyar karne apne sapne saakaar ? Toh kamar kas leejiye kyunki 10 May se shuru ho rahe hai @SrBachchan ke sawaal aur aap ke #KBC13 ke registrations! pic.twitter.com/7X9Kc06mIW
— sonytv (@SonyTV) May 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Kya aap hain taiyyar karne apne sapne saakaar ? Toh kamar kas leejiye kyunki 10 May se shuru ho rahe hai @SrBachchan ke sawaal aur aap ke #KBC13 ke registrations! pic.twitter.com/7X9Kc06mIW
— sonytv (@SonyTV) May 5, 2021Kya aap hain taiyyar karne apne sapne saakaar ? Toh kamar kas leejiye kyunki 10 May se shuru ho rahe hai @SrBachchan ke sawaal aur aap ke #KBC13 ke registrations! pic.twitter.com/7X9Kc06mIW
— sonytv (@SonyTV) May 5, 2021
"కౌన్ బనేగా క్రోరోపతి 13వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించేందుకు అమితాబ్ బచ్చన్ త్వరలో వస్తున్నారు. ఈ సీజన్ రిజిస్ట్రేషన్ మే 10 నుంచి ప్రారంభం కానుంది."
- సోనీ టీవీ ప్రకటన
అంతేకాదు ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేసింది సోనీ టీవీ. 'కేబీసీ' 2000లో సంవత్సరంలో ప్రారంభమైంది. 20 ఏళ్లుగా విజయవంతంగా ఈ షో నడుస్తోంది. షో మొదటి, రెండు సీజన్లకు అమితాబ్ హోస్ట్ వ్యవహరించారు. తర్వాత మూడో సీజన్‌లో షారుఖ్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించాడు.
గతేడాది అన్ని జాగ్రత్తలు తీసుకొని కొవిడ్ సమయంలోనూ బిగ్ బీ గేమ్ షో చేశారు. ఇందులో కొన్ని కొత్త అంశాలను చేర్చారు. ఈ సీజన్లో పాల్గొన్న పోటీదారులతో అమితాబ్ సామాజిక దూరాన్ని పాటిస్తూ షో నిర్వహించారు.
ఇదీ చూడండి: నారీ.. నారీ.. నడుమ 'బాల' మురారీ!