ETV Bharat / sitara

సినీ కార్మికులకు బిగ్​బి అమితాబ్ మెగా సాయం - cinema news

కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లక్ష మంది సినీ కార్మికులకు నెలవారీ రేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు బాలీవుడ్ స్టార్ అమితాబ్.

బిగ్​బి అమితాబ్ బచ్చన్.. సినీ కార్మికులకు మెగాసాయం
అమితాబ్ బచ్చన్
author img

By

Published : Apr 6, 2020, 11:54 AM IST

కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడం వల్ల సినీ కార్మికులు జీవనాధారం కోల్పోయారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు ఎందరో సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా బిగ్​బి అమితాబ్​ ఈ జాబితాలోకి చేరారు. ఆల్‌ ఇండియా ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ కాన్ఫిడరేషన్‌లో సభ్యులుగా ఉన్న లక్ష మంది రోజువారీ సినీ కార్మికుల కుటుంబాలకు నెలవారీ రేషన్‌ను అందించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి సోనీ పిక్చర్స్‌, కల్యాణ్‌ జ్యువెలరీ సంస్థలు మద్దతు ఇవ్వనున్నాయి.

'ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మనకు మనమే చేతనైనంత సాయం చేసుకోవాలి. అమితాబ్‌ చేపట్టిన ఇలాంటి గొప్ప కార్యక్రమంలో మేం భాగం కావడం ఎంతో సంతోషంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న లక్ష మంది రోజువారీ సినీ కార్మికుల కుటుంబాలకు కావాల్సిన నెలవారీ రేషన్‌ను అందించనున్నాం' -సోనీ పిక్చర్స్‌ ప్రతినిధులు

సోనీలో ప్రసారమయ్యే 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' షోకు అమితాబ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. 2010 నుంచి ప్రసారమవుతున్న ఈ కార్యక్రమానికి హోస్ట్​గా ఉన్నారు బిగ్​బి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.