బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 1970ల కాలాన్ని గుర్తు చేసుకున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో రాత్రిపూట నిబంధనలు విధించడంపై అమితాబ్ స్పందించారు. ఈ నిబంధనల వల్ల పనులన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోతాయన్నారు. సినిమా షెడ్యూళ్లు తీవ్రంగా ప్రభావితమవుతాయని.. అయినా.. ఆ తర్వాత నిదానంగా తిరిగి పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ.. రోజువారి పని చేసుకొని బతికే కార్మికుల గురించి ఆలోచిస్తుంటేనే ఆవేదనగా ఉందన్నారు అమితాబ్.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియాలో తన పాత ఫొటోలు పంచుకున్నారు. 1970ల్లో సంవత్సరానికి కేవలం 6 నుంచి 7 సినిమాలు మాత్రమే విడుదలయ్యేవి. 50 నుంచి 100 వారాల పాటు అలరించేవి. ఇప్పుడు విజయాలను ఓటీటీలే నిర్ధారిస్తున్నాయని బిగ్‌బీ అన్నారు.