ETV Bharat / sitara

మనవరాలితో కలిసి పాట పాడిన బిగ్​బీ - ఆరాధ్య బచ్చన్​ వార్తలు

బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​.. తన మనవరాలు ఆరాధ్యతో కలిసి ఓ పాట పాడారు. ఈ సందర్భంగా రికార్డింగ్ స్టూడియోలో దిగిన ఫొటోను అమితాబ్​ షేర్​ చేశారు. అయితే ఇది సినిమా కోసమా లేదా ఏదైన ప్రత్యేక పాట అనేది తెలియాల్సిఉంది.

Amitabh Bachchan records song with granddaughter Aaradhya
సింగర్​గా మారిన బిగ్​బీ మనవరాలు!
author img

By

Published : Dec 31, 2020, 1:08 PM IST

బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​.. తన మనవరాలు ఆరాధ్య బచ్చన్​తో ఓ పాటను పాడారు. ఈ సందర్భంగా రికార్డింగ్​ స్టూడియోలో వారిద్దరూ దిగిన ఫొటోను ట్విట్టర్​లో షేర్​ చేశారు బిగ్​బీ. వీరిద్దరితో పాటు ఆరాధ్య తల్లిదండ్రులైన అభిషేక్​ బచ్చన్, ఐశ్వర్యరాయ్​లు అక్కడే ఉన్నారు.

'తాత, మనవరాలు కలిసి మైక్​ ముందుకు వచ్చినప్పుడు..' ట్యాగ్​తో ఈ ఫొటోను ఇన్​స్టాగ్రామ్​లో అమితాబ్​ షేర్​ చేశారు. అయితే ఆ పాట ఏదైనా సినిమా కోసమా లేదా స్పెషల్​ సాంగా? అనేది తెలియాల్సిఉంది. అమితాబ్​ గతంలో 'మెరే పాస్​ ఆవో', 'రంగ్​ బర్సే', 'మే యహా తూ వహా' అనే పాటలతో ఆయనలోని సింగర్​ను ప్రేక్షకులకు పరిచయం చేశారు.

  • T 3768 - ... tomorrow dawns .. and the celebrations begin .. but for what .. its just another day another year .. big deal !
    Better off making music with the family .. pic.twitter.com/6Tt9uVufbp

    — Amitabh Bachchan (@SrBachchan) December 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అమితాబ్​, ప్రస్తుతం 'బ్రహ్మాస్త్ర', 'ఝుండ్​', 'చెహ్రే', 'మేడే' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇదీ చూడండి: బేబీబంప్​తో అనుష్క శర్మ.. ఫొటోలు వైరల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.