ETV Bharat / sitara

కంటైన్మెంట్ జోన్​గా అమితాబ్ బచ్చన్ ఇంటి పరిసరాలు - అమితాబ్ ఐశ్వర్య

అమితాబ్ బచ్చన్​ బంగ్లాను సీల్​ చేసిన ముంబయి కార్పొరేషన్ అధికారులు.. ఆయన నివసిస్తున్న ప్రాంతాన్ని కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించారు.

కంటైన్మెంట్ జోన్​గా అమితాబ్ 'జల్సా' బంగ్లా
అమితాబ్​కు కరోనా
author img

By

Published : Jul 12, 2020, 12:26 PM IST

బాలీవుడ్​ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్​కు కరోనా సోకడం కలకలం రేపింది. ఈ క్రమంలోనే ఆయన ఇంటి వద్ద​ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టింది. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటిస్తూ బిగ్​బీ నివాసాన్ని సీల్​ చేసింది. ఈ విషయాన్నే సూచిస్తూ ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే అమితాబ్​, అభిషేక్​కు వైరస్ సోకినట్లు నిర్ధరణ అయిన తర్వాత వారి ఇంట్లోని మిగిలిన సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కానీ ఫలితాలు రావాల్సి ఉంది.

amitabh-bachchan-jalsa-bungalow-sealed
అమితాబ్ జల్సా బంగ్లాను సీల్​ చేసిన అధికారులు

అంతకుముందు నానావతి ఆసుపత్రిలో చేరిన అమితాబ్.. తనకు వైద్యం అందిస్తున్న సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియోను విడుదలు చేశారు. తనపై వారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. త్వరలోనే ఈ పరిస్థితిని అధిగమిస్తానని ధీమా వ్యక్తం చేశారు. దేవాలయాలు మూసివేసినా సరే, వైద్యులు దేవుళ్ల రూపంలో వచ్చి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని బిగ్​బీ పేర్కొన్నారు.

అమితాబ్‌.. కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖులతో సహా అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఆయన బలంగా ఉండాలని సూచిస్తూ ట్వీట్లు, సోషల్ మీడియాలో పోస్ట్​లు పెడుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.