ETV Bharat / sitara

'మాస్క్​'ను హిందీలో ఏమంటారో చెప్పిన అమితాబ్ - అమితాబ్ మాస్క్ హిందీ అనువాదం

లాక్​డౌన్​తో ఇంట్లోనే ఉన్న బిగ్​బి అమితాబ్.. 'మాస్క్'ను హిందీలో ఏమంటారో చెప్పారు. అందుకు సంబంధించిన విషయాన్ని ఇన్​స్టాలో పోస్ట్ చేశారు.

'మాస్క్​'ను హిందీలో ఏమంటారో చెప్పిన అమితాబ్
అమితాబ్ బచ్చన్
author img

By

Published : Jun 24, 2020, 3:25 PM IST

Updated : Jun 24, 2020, 7:16 PM IST

కరోనా ప్రభావంతో ప్రతిఒక్కరూ మాస్క్​లు ఉపయోగించడం మొదలుపెట్టారు. అయితే 'మాస్క్' అనే పదాన్ని మీ ప్రాంతీయ భాషల్లో ఏమంటారో తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఆ ప్రయత్నంలో ఉండండి. ఎందుకంటే బాలీవుడ్​ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్.. హిందీలో ఆ పదం అనువాదాన్ని కనిపెట్టేశారు. ఎట్టకేలకు దీని గురించి తెలుసుకున్నానని ఆనందపడుతూ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

" దొరికింది.. దొరికింది... చాలా శ్రమ తర్వాత హిందీలో 'మాస్క్​' అనువాదం దొరికింది. నాసికా ముఖ్​​ సంరక్షక్​ కీటనిరోధక్​ వాయుఛానక్​ వస్త్రదోరియుక్త్​ పట్టిక (ముక్కు, ముఖాన్ని క్రిముల నుంచి సంరక్షిస్తూ.. గాలిని శుద్ధి చేసేందుకు ధరించే పట్టీ)" అని అమితాబ్ రాసుకొచ్చారు.

బిగ్​బి, ఆయుష్మాన్ ఖురానా కలిసి నటించిన 'గులాబో సితాబో'.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీనితో పాటే 'బ్రహ్మాస్త్ర', 'ఝండ్', 'చెహ్​రే' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు అమితాబ్. అయితే లాక్​డౌన్ వల్ల ఈ చిత్రాల షూటింగ్​లు నిలిచిపోయాయి. త్వరలో మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Jun 24, 2020, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.