ETV Bharat / sitara

ఆమిర్​ఖాన్​ 'లాల్​ సింగ్​ చద్దా' విడుదల అప్పుడే!

బాలీవుడ్​ స్టార్​ ఆమిర్​ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'లాల్​ సింగ్​ చద్దా'. ఈ ఏడాది క్రిస్మస్​కు విడుదల కావాల్సిన ఈ సినిమా.. కరోనా ప్రభావంతో వాయిదా పడింది.

Amir khan latest movie laal singh chadda release postponed next Year
ఆమిర్​ఖాన్
author img

By

Published : Aug 11, 2020, 9:51 AM IST

Updated : Aug 11, 2020, 2:37 PM IST

ప్రముఖ బాలీవుడ్​ హీరో ఆమిర్​ఖాన్​ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'లాల్ ​సింగ్​ చద్దా'. అద్వైత్​ చందన్​ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గతేడాది సెట్స్​పైకి వెళ్లి.. 2020 మార్చి వరకు చిత్రీకరణ వేగంగానే జరుపుకొంది. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్​ నిలిపేయాల్సి వచ్చింది. దీంతో ఈ ఏడాది క్రిస్మస్​కు విడుదల చేయాలనుకున్న సినిమా కాస్త.. 2021 క్రిస్మస్​కు వాయిదా పడింది.

ఇప్పటికే సినిమాకు సబంధించిన పలు కీలక సన్నివేశాల్ని దిల్లీ, రాజస్థాన్​, చండీగఢ్​, అమృత్​సర్​, కోల్​కతాల్లో చిత్రీకరించారు. జులైలో లద్దాఖ్​లో షూటింగ్​ జరగాల్సి ఉండగా.. గల్వాన్​ లోయలో భారత్​, చైనా మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చిత్రీకరణ నిలిపేయాల్సి వచ్చింది.

1994 టామ్​ హాంక్స్​ బ్లాక్​ బాస్టర్​ 'ఫారెస్ట్​ గంప్' చిత్రానికి హీందీ రీమేక్​గా దీనిని రూపొందిస్తున్నారు. కరీనా కపూర్​, మోనా సింగ్​ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Last Updated : Aug 11, 2020, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.