హిందీ చిత్రసీమలో స్టార్లుగా పేరున్న ఆమిర్ ఖాన్, కరీనా కపూర్‌కు అభిమానుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. నటనతో పాటు ఇద్దరి స్టైల్ అంటే ప్రజలు బాగా ఇష్టపడతారు. ఈ జోడీ '3 ఇడియట్స్' చిత్రీకరణ కోసం ఓ ప్రాంతానికి వెళ్లగా.. అక్కడ ఓ ఇంటిలో నేలపై కూర్చొని భోంచేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆమిర్, కరీనా జంటగా 2009లో విడుదలైన '3 ఇడియట్స్' సినిమా సూపర్ హిట్ అయింది. రాజ్‌కుమార్ హిరాణి దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆమిర్, కరీనా కలిసి ఓ కుటుంబం ఆతిథ్యం స్వీకరించారు. ఆ స్టార్స్‌కు ఆ ఇంటివారు భోజనం పెట్టగా... నేలపై కూర్చొని తిన్నారు. అంతేకాదు వంటకం బాగుందని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియో ఇప్పుడు అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. స్టార్స్ గ్రామస్థులతో స్నేహంగా వ్యవహరించిన తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. సూపర్ సింప్లిసిటీ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.
'3 ఇడియట్స్' తర్వాత ఈ జోడీ తలాష్(2012) చిత్రంలో నటించింది. ప్రస్తుతం 'లాల్ సింగ్ చద్దా'లో మరోసారి కనిపించనున్నారు. అద్వైత్ చందన్ దర్శకుడు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">