'అన్ఫినిష్డ్' అనే పేరుతో.. తన జీవితంలోని కొన్ని జ్ఞాపకాలను ఓ పుస్తకం రూపంలో ముద్రించనుంది బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా. ప్రస్తుతం దాని ప్రచురణ పూర్తయిందని.. త్వరలోనే విడుదల కానుందని ఆమె సోషల్‌మీడియాలో ప్రకటించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"నా పుస్తకం పూర్తయింది. మొదటిసారిగా నా జ్ఞాపకాలను పేజీలపై ముద్రించడం ఎంతో అద్భుతమైన అనుభూతినిచ్చింది. అన్ఫినిష్డ్ త్వరలోనే విడుదలవుతుంది".
- ప్రియాంక చోప్రా, బాలీవుడ్ నటి
తన జీవితంలోని కొన్ని సంఘటనలతో కలిపి ఓ జ్ఞాపకాన్ని విడుదల చేయనున్నట్లు 2018 జూన్‌లోనే ప్రకటించింది నటి ప్రియాంక. దాన్ని చూసిన వారు వర్ణించలేని అనుభూతిని పొందుతారని తెలిపింది. నటి, నిర్మాత, గాయనిగానే కాకుండా యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ప్రియాంక కెరీర్ సాగుతోంది.