ETV Bharat / sitara

'పుష్ప' న్యూలుక్.. 'హీరోపంతి 2' తొలిషెడ్యూల్​ పూర్తి​

author img

By

Published : Apr 8, 2021, 5:05 PM IST

అల్లు అర్జున్​ పుట్టినరోజు సందర్భంగా 'పుష్ప' సినిమాలోని ఆయన లుక్​కు సంబంధించిన ఓ పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. బాలీవుడ్​ హీరో టైగర్​ష్రాఫ్​ నటిస్తున్న 'హీరోపంతి 2' తొలి షెడ్యూల్​ షూటింగ్​ పూర్తైంది.

pushpa
పుష్ప

అల్లుఅర్జున్​ పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గురువారం.. 'పుష్ప' సినిమాలోని ఆయన లుక్​కు సంబంధించిన ఓ పోస్టర్​ను ఐకానిక్​ స్టార్​ పేరుతో విడుదల చేసింది చిత్రబృందం. ఇది అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.

ఈ చిత్రానికి సుకుమార్​ దర్శకత్వం వహించగా.. పల్లెటూరి అమ్మాయిగా రష్మిక కనిపించనుంది. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ ఇది. మైత్రీమూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మలయాళ నటుడు ఫహాద్​ ఫాజిల్​ విలన్​గా నటిస్తున్నారు. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

pushpa
పుష్ప

టైగర్ ష్రాఫ్ హీరోగా బాలీవుడ్​కు పరిచయమైన చిత్రం 'హీరోపంతి'. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్​లో నటిస్తున్నాడీ హీరో. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్​ షూటింగ్​ను పూర్తిచేసుకున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఈ ఏడాది డిసెంబరు 3న రిలీజ్​ కానున్న ఈ సినిమాకు అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు. తారా సుతారియా కథానాయికగా నటించనుంది.

tiger shroff
టైగర్​ష్రాఫ్​

ఇదీ చూడండి: 'తగ్గేదే లే' అంటున్న 'పుష్ప'రాజ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.