ETV Bharat / sitara

'పుష్ప' సాంగ్​ ప్రోమో.. 'రక్షాబంధన్​' షూటింగ్​ పూర్తి - ఆకాశ్​ పూరీ రొమాంటిక్​ సాంగ్​

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో అల్లుఅర్జున్​ 'పుష్ప', ఆకాష్​ పూరీ 'రొమాంటిక్​', అక్షయ్​కుమార్​ 'రక్షాబంధన్​' చిత్రాల సంగతులు ఉన్నాయి.

cinema
సినిమా అప్డేట్స్​
author img

By

Published : Oct 12, 2021, 12:24 PM IST

అల్లుఅర్జున్​ నటిస్తున్న 'పుష్ప' సినిమాలోని 'శ్రీవల్లి' సాంగ్​ ప్రోమో విడుదలైంది. పూర్తి పాటను అక్టోబర్​ 13న ఉదయం 11.07గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఈ గీతాన్ని సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించగా.. చంద్రబోస్‌ రచించారు. ఇప్పటికే రిలీజ్​ అయిన 'దాక్కో దాక్కో మేక' సాంగ్​(pushpa dakko dakko meka song) అభిమానులను ఆకట్టుకుంది. ఈ మూవీలో రష్మిక హీరోయిన్​. కన్నడ నటుడు ధనుంజయ, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, అజయ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది. శేషాచలం అడవుల నేపథ్యంలో సాగే కథ ఇది. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సాంగ్​ రిలీజ్​

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా(akash puri romantic movie) నటించిన చిత్రం 'రొమాంటిక్'. కేతికా శర్మ కథానాయిక. తాజాగా ఈ సినిమాలోని 'పీనే కే బాద్​' పాట విడుదలై ఆకట్టుకుంటోంది. అనిల్‌ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతోందీ చిత్రం. పూరి జగన్నాథ్‌ కథ, స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ అందించారు.

షూటింగ్​ పూర్తి

అక్షయ్​ కుమార్(Akshay Kumar new movie)​, భూమి పెడ్నేకర్ కలిసి నటించిన సినిమా రక్షాబంధన్'(Raksha bandhan movie). ఆనంద్ ఎల్ రాయ్ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్​ పూర్తి చేసుకున్నట్లు తెలిపింది చిత్రబృందం.

rakshabandhan
రక్షాబంధన్​ షూటింగ్​ పూర్తి

ఇదీ చూడండి: అదిరిపోయే పోజులతో మెస్మరైజ్​ చేస్తున్న చిత్రాంగి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.