ETV Bharat / sitara

'పుష్ప' అప్డేట్​.. 'బ్రో', 'క్యాలీఫ్లవర్'​ ట్రైలర్స్​ - cinema updates

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి(cinema updates telugu). ఇందులో అల్లుఅర్జున్​ 'పుష్ప', నవీన్​చంద్ర 'బ్రో', సంపూర్ణేశ్​బాబు 'క్యాలిఫ్లవర్'​ ట్రైలర్స్​​ ఉన్నాయి. ఆద్యంతం నవ్వులు పూయిస్తున్న ఈ ప్రచార చిత్రాలను మీరూ చూసేయండి...

pushpa
పుష్ప
author img

By

Published : Nov 20, 2021, 5:43 PM IST

గత కొద్ది రోజులుగా 'పుష్ప'(pushpa allu arjun movie) హిందీ వెర్షన్​ విడుదలపై సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. ఏఏఫిలిమ్స్​ ఇండియా ద్వారా మూవీని రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది(pushpa movie hindi release date). అలాగే కర్ణాటకలో స్వాగత్​ ఎంటర్​ప్రైజస్​ ద్వారా విడుదల కానున్నట్లు వెల్లడించింది. డిసెంబరు 17న అన్ని భాషల్లోనూ డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కుతోన్న 'పుష్ప' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. స్టైలిష్‌ డైరెక్టర్‌ సుకుమార్‌(sukumar alluarjun movie) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బన్నీ పుష్పరాజ్‌ అనే ఎర్రచందనం స్మగ్లర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక సందడి చేయనున్నారు(alluarjun rashmika movie). ప్రతినాయకుడిగా మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. 'పుష్ప ది రైజ్‌' పేరుతో మొదటి భాగాన్ని డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, గ్లింప్స్​ ఫ్యాన్స్​ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి.

ట్రైలర్​

"అన్నయ్యా.. నేను ఉన్నంతవరకూ నువ్వు ఎప్పుడూ ఒంటరి కాదు. నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. దాని కోసం నేను ఏదైనా చేస్తాను. ఏమైనా దాటి వస్తాను" అని అంటున్నారు నటి అవికాగోర్‌. ఆమె, నవీన్‌ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బ్రో'(naveen chandra bro movie). అన్నాచెల్లెల అనుబంధంపై తెరకెక్కిన కుటుంబకథా చిత్రమిది. కార్తిక్‌ తుపురాని దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్‌ 26న సోనీ లివ్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది(naveen chandra bro movie release date). ఈ నేపథ్యంలో శనివారం(నవంబరు 20) విడుదలైన 'బ్రో' ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది(naveen chandra bro movie trailer).

అన్నాచెల్లెల్లుగా నవీన్‌ చంద్ర, అవికాగోర్‌ నటన మెప్పించేలా ఉంది. "ఎందుకో తెలీదు నాకు బాగా ఇష్టమైనవన్నీ ఎప్పుడూ నాకు దూరమయ్యాయి. ఎటు చూసినా ఒక్కటే దొరికేది.. ఒంటరితనం" అంటూ నవీన్‌చంద్ర చెప్పే డైలాగ్‌లతో ప్రారంభమైన ట్రైలర్‌లోని ప్రతి సన్నివేశం సహజత్వానికి దగ్గరగా ఉంది. "ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలతోపాటు వైఫై కూడా అత్యవసరాల్లో ఒకటి బ్రో" అంటూ అవికా.. తన అన్నయ్యను ఆటపట్టించడం సరదాగా అనిపించింది. జేజేఆర్‌ రవి చంద్‌ ఈ చిత్రానికి నిర్మాత.

నవ్వులు పూయిస్తూన్న

'హృదయ కాలేయం', 'కొబ్బరి మట్ట' వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన సంపూర్ణేశ్‌ బాబు నటించిన సరికొత్త చిత్రం 'క్యాలీఫ్లవర్‌'(sampoornesh babu cauliflower movie). ఈ చిత్రానికి ఆర్‌.కె.మలినేని దర్శకత్వం వహించారు. విభిన్నమైన కథతో ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకలు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా 'క్యాలీఫ్లవర్‌' ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం(sampoornesh babu cauliflower movie trailer). "ఎక్కడ చూసినా క్యాలీఫ్లవర్‌ గురించే చర్చ", "పార్లమెంట్‌ సాక్షిగా సభ పెట్టాడు ఈ క్యాలీఫ్లవర్‌", "వీడెవడో ఒక్కరోజులోనే సెన్సేషన్‌ క్రియేట్‌ చేసేలా ఉన్నాడు" అనే డైలాగ్‌లతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది.

సంపూర్ణేశ్‌బాబు నటన, ఆయన సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. "ఈ ఊర్లో పుట్టిన మనుషులకైనా, జంతువులకైనా ఒక్కటే భర్త, ఒక్కటే భార్య.. ఇదే ఈ క్యాలీఫ్లవర్‌ రూల్‌" అంటూ ఆయన చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంది. మధుసూదన క్రియేషన్స్‌, రాధాకృష్ణ టాకీస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నవంబర్‌ 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: 'పుష్ప' సినిమాలోని​ 'ఇది నా అడ్డా' సాంగ్ వచ్చేసింది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.