హీరో అల్లు అర్జున్(allu arjun daughter birthday) ముద్దుల కూతురు అల్లు అర్హ పుట్టినరోజు నేడు(నవంబరు 21). ఈ వేడుకను ఎప్పటికీ గుర్తుండిపోయేలా గ్రాండ్‌గా చేసింది బన్నీ ఫ్యామిలీ. ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం అయిన బుర్జ్ ఖలీఫాపై అర్హ చేత(Arha birthday on Burj Khalifa) కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలను జరిపింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు బన్నీ. ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అభిమానులంతా అర్హకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


అర్హ.. సమంత నటించిన 'శాకుంతలం' సినిమాతో త్వరలోనే వెండితెర అరంగేట్రం చేయనుంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిందీ సినిమా. ఇందులో సామ్.. శాకుంతలగా కనిపించనుంది. ఇక అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప' సినిమాతో డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానున్నారు.


విదేశీ పర్యటనలో ఎన్టీఆర్ ఫ్యామిలీ
తన కుటుంబ సభ్యులతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ విదేశాల్లో పర్యటిస్తున్నారు. ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ సమీపంలో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. ఇందులో తన పెద్ద కుమారుడిని ముద్దాడుతూ కనిపించారు.
ఇదీ చూడండి: Radheshyam story: ప్రభాస్ 'రాధేశ్యామ్' కథ లీక్!