ETV Bharat / sitara

'పుష్ప'రాజ్​ జోరు తగ్గడం లే!

ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్-దర్శకుడు సుకుమార్​ కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న మూడో చిత్రం 'పుష్ప'. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఇటీవలే సినిమా టీజర్​ను చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పుడా వీడియో యూట్యూబ్​లో 60 మిలియన్ల వీక్షణలతో సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది.

Allu Arjun's Pushpa teaser crossed 60 million views mark in youtube
'పుష్ప'రాజ్​ జోరు తగ్గడం లే!
author img

By

Published : May 5, 2021, 8:08 AM IST

'తగ్గేదే లే' అంటున్నాడు 'పుష్ప'రాజ్​. యూట్యూబ్‌లో వచ్చినప్పటి నుంచి తన జోరుని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఐకాన్​స్టార్​ అల్లు అర్జున్​ పుట్టినరోజు సందర్భంగా.. పుష్పరాజ్‌ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో 60 మిలియన్ల వీక్షణలను సొంతం చేసుకుంది. టాలీవుడ్​ చరిత్రలో అన్ని వ్యూస్​ దక్కించుకున్న తొలి సినిమా టీజర్​ ఇదే కావడం విశేషం.

'ఆర్య', 'ఆర్య2' చిత్రాల తర్వాత అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కిస్తున్న చిత్రమే 'పుష్ప'. రష్మిక కథానాయిక. నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. తెలుగులోనే కాకుండా ఇతర పరిశ్రమల్లోనూ మార్కెట్‌ను పెంచుకుంటున్నారు అల్లు అర్జున్‌. అందుకే 'పుష్ప' చిత్రాన్ని పాన్‌ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు.

దక్షిణాదికి చెందిన నాలుగు ప్రధాన భాషలతో పాటు హిందీలోనూ ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ ఇది. నాయకా నాయికల పాత్రలు రాయలసీమ యాసలో మాట్లాడి అలరించనున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: నీ నవ్వులే రత్నాలు.. నీ మాటలే ముత్యాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.