ETV Bharat / sitara

అల్లు అర్జున్​ 'ఐకాన్'​కు త్వరలోనే ముహూర్తం! - ఐకాన్​ సినిమాపై దర్శకుడి స్పష్టత

అల్లు అర్జున్-వేణు శ్రీరామ్​ కాంబినేషన్​లో 'ఐకాన్​' చిత్రం తెరకెక్కనుందని గతంలో ఓ ప్రకటన వచ్చింది. అయితే రెండేళ్లుగా ఈ ప్రాజెక్టుపై ఎలాంటి అప్​డేట్​ రాకపోవడం వల్ల ఈ సినిమాను పక్కనపెట్టినట్లే అనుకున్నారంతా! ఈ నేపథ్యంలో 'ఐకాన్​' సినిమాపై దర్శకుడు వేణు శ్రీరామ్ స్పందించారు. త్వరలోనే ఈ చిత్ర ప్రీ-ప్రొడక్షన్​ వర్క్​ను ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Allu Arjun's Icon is not shelved, director confirms
'ఐకాన్'​కు త్వరలోనే ముహూర్తం.. దర్శకుడు స్పష్టత
author img

By

Published : Mar 21, 2021, 11:11 AM IST

Updated : Mar 21, 2021, 11:38 AM IST

స్టైలిష్​స్టార్​ అల్లు అర్జున్​-వేణు శ్రీరామ్​ కాంబినేషన్​లో 'ఐకాన్'​ అనే చిత్రం రూపొందనుందని గతంలోనే ప్రకటన వచ్చింది. 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' సినిమా తర్వాత ఈ సినిమా పట్టాలెక్కుతుందని అప్పట్లో అందరూ భావించారు. కానీ, అంతలోనే త్రివిక్రమ్​ దర్శకత్వంలో 'అల.. వైకుంఠపురంలో' చిత్రంతో బ్లాక్​బాస్టర్​ అందుకున్నాడు బన్నీ. ఆ తర్వాత అయినా 'ఐకాన్​' ప్రారంభిస్తారని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది.

ఈ నేపథ్యంలో ఒకవైపు సుకుమార్​ దర్శకత్వంలో 'పుష్ప'లో అల్లు అర్జున్​ నటిస్తుండగా.. మరోవైపు దర్శకుడు వేణు శ్రీరామ్​ 'వకీల్​సాబ్​' చిత్రంతో బిజీగా ఉన్నారు. దీంతో 'ఐకాన్​' సినిమాను మర్చిపోవాల్సిందే అనుకున్నారంతా! కానీ, ఈ ప్రాజెక్టుపై దర్శకుడు వేణు తాజాగా స్పందించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్​ వర్క్​ను ప్రారంభించనున్నట్లు 'వకీల్​సాబ్'​ ప్రమోషన్స్​లో స్పష్టం చేశారు.

Allu Arjun's Icon is not shelved, director confirms
అల్లు అర్జున్​

అయితే.. 'పుష్ప' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నారు. దీనిపై ఇదివరకే ఓ ప్రకటన వచ్చింది. వేణు శ్రీరామ్​ దర్శకత్వంలో రూపొందిన 'వకీల్​సాబ్​' చిత్రం ఏప్రిల్​ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో 'ఐకాన్​' సినిమాకు ముహూర్తం ఎప్పుడు కుదురుతుందో తెలియాల్సిఉంది.

'ఐకాన్​' పోస్టర్​

ఇదీ చూడండి: 'పుష్ప' విలన్​గా మలయాళ నటుడు

Last Updated : Mar 21, 2021, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.