ETV Bharat / sitara

అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబో మరోసారి.. ఆ నిర్మాత ట్వీట్ - pushpa movie songs

టాలీవుడ్​ సక్సెస్​ కాంబినేషన్లలో ఒకటైన బన్నీ-త్రివిక్రమ్(allu arjun trivikram movies).. మరోసారి కలిసి పనిచేయనున్నారు. అయితే అది సినిమానా? లేదా మరేదైనా ప్రాజెక్టు అనేది తెలియాల్సి ఉంది.

allu arjun trivikram combination
అల్లు అర్జున్- త్రివిక్రమ్
author img

By

Published : Oct 28, 2021, 11:50 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-త్రివిక్రమ్(allu arjun trivikram movies)​ కాంబోలో మరో సినిమాకు రంగం సిద్ధమైందా? ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్​లో హాట్​టాపిక్​గా మారింది. సితార ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై పలు సినిమాలు నిర్మించిన సూర్యదేవర నాగవంశీ.. గురువారం ఉదయం ఓ ట్వీట్ చేశారు. త్వరలో బిగ్​ సర్​ప్రైజ్ రానుందని చెప్పడం సహా బన్నీ, త్రివిక్రమ్, తమన్​తో కలిసున్న ఫొటోను పోస్ట్ చేశారు. దీంతో అభిమానులు అప్పుడే పండగ చేసుకోవడం మొదలుపెట్టేశారు.

allu arjun trivikram combination
అల్లు అర్జున్- త్రివిక్రమ్​తో నిర్మాత నాగవంశీ

బన్నీ-త్రివిక్రమ్(allu arjun trivikram movies) కలయికలో ఇప్పటికే 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో'(ala vaikunthapurramuloo full movie) లాంటి హిట్, బ్లాక్​బస్టర్​ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. దీంతో నాలుగోసారి వీళ్ల సినిమా అంటే అంచనాలు భారీగా ఉండే అవకాశముంది. మరి దీని గురించి స్పష్టత రావాలంటే ఆ సర్​ప్రైజ్​ వచ్చేవరకు వెయిట్​ చేయాల్సిందే.

బన్నీకి కుదురుతుందా?

ప్రస్తుతం అల్లు అర్జున్ లైనప్​ పకడ్బందీగా ఉంది. ప్రస్తుతం చేస్తున్న 'పుష్ప'(pushpa release date) తర్వాత 'ఐకాన్', 'పుష్ప 2', స్టార్ డైరెక్టర్ మురగదాస్​తో సినిమాలు చేయాల్సి ఉంది. బోయపాటితోనూ మరోసారి కలిసి పనిచేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ త్రివిక్రమ్​తో(trivikram next movie) సినిమా అనుకుంటే మాత్రం వీటన్నింటి మధ్య కుదురుతుందా అనేది ప్రశ్న?

మహేశ్​తో త్రివిక్రమ్..

సూపర్​స్టార్ మహేశ్​బాబు 'సర్కారు వారి పాట'(sarkaru vaari paata release date) తర్వాత త్రివిక్రమ్​తో సినిమా పనిచేయనున్నారు. ఈ సినిమా పూర్తి కావాలంటే మరో ఏడాది పట్టొచ్చు. ఆ తర్వాత వీలుచూసుకుని బన్నీతో(allu arjun new movie) కలిసి పనిచేసే అవకాశం ఉండొచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో?

'పుష్ప' నుంచి మాస్ సాంగ్

బన్నీ 'పుష్ప'(pushpa movie songs) నుంచి మరో లిరికల్ సాంగ్ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. 'సామి సామి'(saami saami) అనే లిరిక్స్​తో సాగుతూ అలరిస్తోంది. అల్లు అర్జున్, రష్మిక.. ఇందులోని తమ డ్యాన్స్​, ఆహార్యంతో ఆకట్టుకుంటున్నారు. డిసెంబరు 17న సినిమా థియేటర్లలోకి రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.