ETV Bharat / sitara

కొత్త అప్​డేట్స్: 'పుష్ప'రాజ్ వచ్చేసినాడు! - allu arjun news

బన్నీ నటిస్తున్న 'పుష్ప' కొత్త లుక్​ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. పుష్పరాజ్ వచ్చేసినాడు అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ జరుగుతోంది.

ALLU ARJUN PUSHPA SHOOTING STARTS
కొత్త అప్​డేట్స్: 'పుష్ప'రాజ్ వచ్చేసినాడు
author img

By

Published : Nov 12, 2020, 3:18 PM IST

Updated : Nov 12, 2020, 3:25 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప షూటింగ్​.. చాలా నెలల విరామం తర్వాత తిరిగి మొదలైంది. ఈ సందర్భంగా నడుచుకుంటూ వెళ్తున్న బన్నీ ఫొటోను చిత్రబందం విడుదల చేసింది. సాదాసీదా దుస్తుల్లో బన్నీ గ్రామీణ ప్రాంత యువకుడిలా కనిపిస్తూ అలరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్​లోని మారేడుమిల్లి అడవుల్లో ప్రస్తుతం చిత్రీకరణ సాగుతోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్​ నేపథ్య కథాంశంతో సినిమా తీస్తున్నారు. రష్మిక హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. సుకుమార్ దర్శకుడు.

మెగాఅల్లుడు మూడో సినిమా

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్​దేవ్.. మరో సినిమాను ఒప్పుకున్నారు. గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. 'అశ్వథ్థామ' ఫేమ్ రమణతేజ్​ దర్శకత్వం వహించనున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు.

kalyan dev new movie
కల్యాణ్​ దేవ్ కొత్త సినిమా పూజా కార్యక్రమం

ఫస్ట్​ లుక్స్​ విడుదల

కన్నడ సూపర్​హిట్​ 'దియా' ఫేమ్ దీక్షిత్ శెట్టి నటిస్తున్న 'ద రోజ్ విల్లా' ఫస్ట్​లుక్​ను హీరో శ్రీ విష్ణు విడుదల చేశారు. సుధాకర్ కోమాకుల హీరోగా నటిస్తున్న 'రీసెట్' ఫస్ట్​లుక్ కూడా విడుదలైంది.

ఇది చదవండి: 'పుష్ప'లో అల్లు అర్జున్​తో పాటు మరో హీరో?

Last Updated : Nov 12, 2020, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.