ETV Bharat / sitara

'పుష్ప' అప్​డేట్​.. కిర్రాక్ లుక్​లో బన్నీ

author img

By

Published : Apr 3, 2021, 11:08 AM IST

అల్లు అర్జున్​ నటిస్తున్న 'పుష్ప' సినిమాకు సంబంధించి చిన్న వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఈ మూవీకి సుకుమార్​ దర్శకత్వం వహిస్తుండగా.. హీరోయిగా రష్మిక నటిస్తోంది. ఆగస్టు 13న విడుదల కానుందీ సినిమా.

Pushpa Prelude
'పుష్ప' అప్​డేట్​

సుకుమార్​ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. రష్మిక కథానాయిక. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీల్యూడ్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో బన్నీ లుక్ అదిరిపోయింది. బన్నీ పూర్తి లుక్​ను ఏప్రిల్ 7న సాయంత్రం 6.12 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సినిమాలో పుష్పరాజ్‌ పాత్ర పోషిస్తున్నారు బన్నీ. పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది రష్మిక. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ ఇది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మలయాళ నటుడు ఫహాద్​ ఫాజిల్​ ఇందులో విలన్​గా కనిపించనున్నారు. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. 'ఆర్య', 'ఆర్య 2' తర్వాత బన్నీ- సుకుమార్‌ మరోసారి కలిసి చేస్తుండటం వల్ల ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.