ETV Bharat / sitara

Pushpa Allu arjun: 'పుష్ప' షూటింగ్ రీస్టార్ట్.. తగ్గేదే లే - పుష్ప షూటింగ్ రీస్టార్ట్

బన్నీ 'పుష్ప' షూటింగ్ రీస్టార్ అయింది. ఈ సినిమా ఏడాది చివరికల్లా థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. ఇప్పటికే వచ్చిన 'పుష్ప' ఇంట్రో టీజర్.. యూట్యూబ్​లో రికార్డులు సృష్టిస్తోంది.

Allu arjun Pushpa movie resumed shoot in Hyderabad
అల్లు అర్జున్ పుష్ప మూవీ
author img

By

Published : Jul 6, 2021, 12:28 PM IST

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ 'పుష్ప' షూటింగ్ తిరిగి హైదరాబాద్​లో సోమవారం మొదలైంది. బన్నీతో పాటు ఫహద్ ఫాజిల్, హీరోయిన్ రష్మిక తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్​ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని యూనిట్ భావిస్తోంది. దీంతో ఈ ఏడాది చివరి కల్లా థియేటర్లలోకి 'పుష్ప'ను తీసుకురావాలనేది ప్లాన్! మరి ఏం జరుగుతుందో చూడాలి?

.
.

విలన్​గా హాస్యనటుడు సునీల్?

హాస్యనటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సునీల్.. 'కలర్​ఫోటో'లో ప్రతినాయకుడిగా మెప్పించారు. ఇప్పుడు 'పుష్ప' తొలిభాగంలోనూ అదే తరహా పాత్రలో నటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

విలన్స్ ధనంజయ్, ఫహద్

తొలి భాగంలో తాను విలన్​గా కనిపిస్తానని కన్నడ నటుడు ధనంజయ్ ఇటీవల క్లబ్​హౌస్​లో మాట్లాడుతూ వెల్లడించారు. రెండో భాగంలో ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా అలరించనున్నారని చెప్పారు. తమ పాత్రలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయని అన్నారు.

.
.

కథానేపథ్యం అదే

చిత్తూరు ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో 'పుష్ప'ను దర్శకుడు సుకుమార్.. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్​తో మైత్రీమూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఇప్పటికే వచ్చిన టీజర్​ మిలయన్ల కొద్ది వ్యూస్​తో దూసుకుపోతూ రికార్డులు సృష్టిస్తోంది.

.
.
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.