ఈ ఏడాది సంక్రాంతి బరిలో 'అల వైకుంఠపురములో' అంటూ వచ్చి ఘన విజయాన్ని అందుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇందులో అల్లు అర్జున్ తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
ఎర్ర చందనం స్మగ్లర్ల నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతుందీ చిత్రం. 'శేషాచలం' అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారు. ఇందులో బన్నీ.. చిత్తూరు ప్రాంత కుర్రాడిగా మాస్ లుక్‌లో తెరపై కనిపించనున్నాడని ఇప్పటికే వార్తలొచ్చాయి. తాజాగా రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఒకటి ఫుల్ మాస్ అవతారం, మరొకటి క్లాస్ లుక్తో ఉంటుందని టాక్. అల్లుఅర్జున్ లారీ డ్రైవర్గా, విజయ్ సేతుపతి అటవీ శాఖ అధికారిగా, హీరోయిన్ రష్మిక గిరిజన యువతిలా కనిపించనున్నారని సమాచారం.
ఇదీ చూడండి.. ఆ సింగర్ మేనేజర్ సౌమ్య మృతిపై వీడిన మిస్టరీ