ETV Bharat / sitara

చిరంజీవి సమక్షంలో అల్లు అర్జున్‌కు సన్మానం.. ఫొటోలు వైరల్‌ - puspa movie updates

Allu Arjun Fecilitation: పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌ సాధించిన విజయం పట్ల ఆయన మావయ్య (స్నేహారెడ్డి తండ్రి) కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో బన్నీకి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో దర్శకులు హరీశ్‌ శంకర్‌, సుకుమార్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, గుణశేఖర్‌ పాల్గొన్నారు.

Allu Arjun Fecilitation
అల్లు అర్జున్‌
author img

By

Published : Mar 21, 2022, 2:22 PM IST

Allu Arjun Fecilitation: 'పుష్ప'తో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు ఐకాన్‌స్టార్‌ అల్లుఅర్జున్‌. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ బన్నీ విజయకేతనం ఎగురవేశారు. బాలీవుడ్‌లో ఈ సినిమా రూ.100 కోట్లు కలెక్ట్‌ చేసినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. కాగా, అల్లు అర్జున్‌ సాధించిన విజయం పట్ల ఆయన మావయ్య (స్నేహారెడ్డి తండ్రి) కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో బన్నీకి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

Allu Arjun Fecilitation
పుష్ప విజయంపై అల్లు అర్జున్‌కు సన్మానం

చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో దర్శకులు హరీశ్‌ శంకర్‌, సుకుమార్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, గుణశేఖర్‌ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇక, 'పుష్ప' విషయానికి వస్తే సుకుమార్‌-బన్నీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్‌ చిత్రమిది. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఇది తెరకెక్కింది. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించారు. మైత్రి మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Allu Arjun Fecilitation
అల్లు అర్జున్‌కు సన్మానం

ఇదీ చదవండి: 'ఆర్​ఆర్​ఆర్​'కు కలిసొచ్చే అంశాలివే.. రూ.3వేల కోట్లు పక్కా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.