Allu Arjun bollywood debut: 'గంగోత్రి' సినిమాతో పరిచయమైన అల్లు అర్జున్.. 'ఆర్య', 'దేశ ముదురు', 'జులాయి', 'అల వైకుంఠపురము'లో వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగారు. తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉన్న బన్నీకి మలయాళం సహా ఇతర దక్షిణాది భాషల్లోనూ అభిమానులున్నారు. డబ్బింగ్ సినిమాల ద్వారా హిందీ ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు ఐకాన్ స్టార్. దీంతో ఉత్తరాది అభిమానులు బన్నీ స్ట్రెయిట్ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ ఎంట్రీపై స్పందించారు అల్లు అర్జున్. ఇటీవలే ఓ హిందీ సినిమా ఆఫర్ వచ్చిందని తెలిపారు. అయితే హిందీలో తన అరంగేట్రం కోసం అక్కడి ప్రేక్షకులు మరి కొన్ని రోజులు వేచిచూడక తప్పదని అన్నారు.
"నాకు హిందీ నుంచి ఓ ఆఫర్ వచ్చింది. కానీ అదంత ఎగ్జైటింగ్‌గా అనిపించలేదు. త్వరలోనే అది (బాలీవుడ్ ఎంట్రీ) జరుగుతుందని ఆశిస్తున్నా. వేరే ఇండస్ట్రీలో పనిచేయడానికి ఎంతో ధైర్యం, తెగువ కావాలి."
-అల్లు అర్జున్, నటుడు
హిందీలో సహాయ నటుడిగా, రెండో నటుడి పాత్రలో చేయడానికి సిద్ధంగా లేనని చెప్పారు అల్లు అర్జున్. "కథానాయకుడిగా తప్ప మరే పాత్రలోనూ చేయడానికి నాకు ఆసక్తిలేదు. పెద్ద స్టార్‌ను సెకండ్ రోల్లో పెడితే సినిమాకే నష్టం." అని బన్నీ అన్నారు.
'పుష్ప' వసూళ్లలో తగ్గేదేలే!
అల్లు అర్జున్ 'పుష్ప' హిందీ వెర్షన్.. బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. రిలీజై ఇన్ని రోజులు అవుతున్నా సరే కలెక్షన్లు, అదిరిపోయే రేంజ్లో వస్తున్నాయి. ఇప్పటికే 'పుష్ప' హిందీ వెర్షన్ వసూళ్లు రూ.50 కోట్లు దాటాయి. శనివారం ఒక్కరోజే రూ.6.1 కోట్ల కలెక్షన్ రావడం విశేషం.
ఇదీ చూడండి: బాలీవుడ్లో బన్నీ ధమాకా.. కళ్లు చెదిరేలా 'పుష్ప' వసూళ్లు