ETV Bharat / sitara

ప్రేమకథలందు 'ఆర్య' కథ వేరయా! - సుకుమార్, అల్లు అర్జున్ ఆర్యకు 17 ఏళ్లు

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందిన మొదటి చిత్రం 'ఆర్య'. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మెప్పించిన ఈ చిత్రం 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం.

Allu Arjun Arya
అల్లు అర్జున్ ఆర్య
author img

By

Published : May 7, 2021, 1:49 PM IST

'ఆర్య'.. టాలీవుడ్ టాప్-10 లవ్​స్టోరీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. సరికొత్త పంథాలో సాగిపోయే ఈ సినిమా కథ చూశాక ప్రతి ప్రేక్షకుడు 'ఫీల్ మై లవ్'​ అంటూ థియేటర్ల నుంచి బయటి వచ్చాడంటే అతిశయోక్తి కాదు. లెక్కల మాస్టార్ సుకుమార్​ దర్శకుడిగా పరిచయమైన చిత్రమిది. అలాగే 'గంగోత్రి' తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన రెండో మూవీ. వీరిద్దరి కాంబో గురించి ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు అంటే అందుకు కారణం 'ఆర్య'. ఈ సినిమా నేటితో 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం.

ప్రేమ, ద్వేషం.. ఓ ఆర్య

సాధారణంగా ప్రేమ కథలు హీరో, హీరోయిన్​ను చూడటం, ఆమె వెంట పడటం, ఐ లవ్ యూ చెప్పడం, తర్వాత ఆ ప్రేమను కాపాడుకోవడం వంటి పంథాలో సాగుతాయి. కానీ 'ఆర్య' ఈ రొటీన్ ఫార్ములాను పక్కకునెట్టి సరికొత్త పంథాలో సాగుతుంది. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇందులో హీరోయిన్ గీత (అనురాధా మెహతా) మొదట అజయ్ (శివ బాలాజీ) అనే వ్యక్తికి ఐ లవ్​ యూ చెప్తుంది (బిల్డింగ్​పై నుంచి దూకేస్తా అని బెదిరిస్తే). కానీ అదే సమయంలో కథానాయికను చూసిన ఆర్య (అల్లు అర్జున్).. ఓ పువ్వు తీసుకెళ్లి ఆమె చేతిలో పెట్టి ఐ లవ్ యూ అంటాడు. వినడానికి కాస్త కొత్తగా అనిపిస్తుంది కదా. ఇదే 'ఆర్య'ను ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తు పెట్టువకోడానికి కారణం. ఇందులో అజయ్, గీతల మధ్య ప్రేమను, ఆర్య, గీతల మధ్య ప్రేమను విభిన్న కోణాల్లో చూపించారు దర్శకుడు సుకుమార్. ముఖ్యంగా ఆర్యను గీత ద్వేషించడం, దాన్ని ఆర్య మనస్ఫూర్తిగా స్వీకరించడం కూడా భలేగా ఉంటుంది. ఈ ముగ్గురి మధ్య ఓ ట్రైయాంగిల్ లవ్​ స్టోరీ క్రియేట్ చేసి దానిలో నిజమైన ప్రేమ ఇదే అంటూ కథను నడిపించే ప్రయత్నం మెప్పిస్తుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అందరి పాత్రలూ గుర్తుంటాయి

ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్​కు ఎన్ని మార్కులు పడ్డాయో శివ బాలాజీ, అనురాధాలకు అంతే పేరు వచ్చింది. వీరు ముగ్గురు సినిమాకు ప్రధాన బలం. శివబాలాజీ తండ్రి పాత్ర పోషించిన రాజన్ పీ దేవ్ పాత్ర కూడా చాలా బాగా తీర్చిదిద్దారు. ఆయన గంభీరత్వం తెరపై కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అలాగే అజయ్ స్నేహితుడిగా వేణు మాధవ్ కామెడీ నవ్విస్తుంది.

సుకుమార్​ కొత్త పంథా

దర్శకుడిగా మొదటి చిత్రమైనా రొటీన్​ ఫార్ములాతో కాకుండా విభిన్నంగా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు సుకుమార్. అజయ్, గీత, ఆర్యల మధ్య ట్రైయాంగిల్ లవ్​ స్టోరీని చాలా బాగా నడిపించారు. అజయ్​, గీతల పెళ్లి చేయడమే తన బాధ్యత అంటూ ఆర్య చెప్పడం, వారి పెళ్లికి అడ్డుచెప్పిన అజయ్ తండ్రికి బుద్ది చెప్పడం వంటి సన్నివేశాలతో కథను చాలా బాగా అల్లుకున్నాడు. ఈ క్రమంలోనే శివ బాలాజీ అదృశ్యమవడం, ఆర్య గొప్పతనం గీత తెలుసుకోవడం, అతడిని ఇష్టపడటం జరుగుతుంది. గీత, ఆర్యపై తన ఫీలింగ్స్ చెప్పే సందర్భంలో అతడు చెవులు మూసుకోవడం, తర్వాత గీతతో పెళ్లికి అజయ్ తన తండ్రిని ఒప్పించి తీసుకురావడం వంటి సన్నివేశాలతో కథపై పూర్తి పట్టు కనిపిస్తుంది. చివర్లో పెళ్లికి ముందు ఆర్య తన ఫీలింగ్స్ తెలియజేయడం, పెళ్లి పీటలపై నుంచి గీత 'నాకు ఆర్య కావాలి' అంటూ వెళ్లిపోవడం.. ఇలా కథను క్లైమాక్స్​ చేర్చడంలో విజయవంతమయ్యాడు సుకుమార్.

దేవీ సంగీతం పెద్ద ప్లస్

ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం పెద్ద ప్లస్ అని చెప్పాలి. హీరోకు అదిరిపోయే ఇంట్రడక్షన్ సాంగ్, తర్వాత 'అ అంటే అమలాపురం' వంటి ఐటమ్​ సాంగ్​తో ప్రేక్షకుల్లో జోష్ తెప్పించాడు. 'ఇక ఏదో ప్రియ రాగం వింటున్నా', 'ఫీల్ మై లవ్'​ అంటూ సాగే ఫీల్ గుడ్ సాంగ్స్​.. మిమ్మల్ని ప్రేమలో పడేస్తాయి. ఇక వీటికి తోడు బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్​తో ఓ ట్రాన్స్​లోకి తీసుకెళ్లాడు. సినిమా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.

ఈ సినిమా హిట్ కావడం వల్ల అల్లు అర్జున్-సుకుమార్ 'ఆర్య 2'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం సంగీతం పరంగా విజయం సాధించినా.. బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చింది. ప్రస్తుతం వీరిద్దరూ 'పుష్ప'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. 'ఆర్య', 'ఆర్య 2'తో అల్లు అర్జున్​ను స్టైలిష్ స్టార్​గా మార్చిన సుక్కూ.. 'పుష్ప'తో ఐకాన్ స్టార్​గా మార్చేందుకు మాస్, మసాలా అంశాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.