రామాయణ ఇతిహాసాన్ని వెండితెరపైకి తీసుకురావడానికి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో పడ్డారు. తాజాగా ఈ సినిమా విషయంపై ఓ స్పష్టత వచ్చింది.
ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా (ప్రైమ్ ఫోకస్) కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా త్రీడీ ఫార్మాట్లో తెరకెక్కనుంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో మొత్తం మూడు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. మొదటి పార్ట్ 2021లో విడుదలకానుంది. 'దంగల్' ఫేం నితేశ్ తివారీ, 'మామ్' ఫేం రవి ఉద్యవార్ మూవీకి దర్శకత్వం వహించనున్నారు.
నటీనటులు, సాంకేతిక నిపుణులను త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రముఖ నటులు ఇందులో నటించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను దృష్టిలో ఉంచుకుని చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇవీ చూడండి.. లైవ్‌లో రిపోర్టర్‌తో 'జడ్జిమెంటల్' కంగన ఫైట్