ETV Bharat / sitara

'నాకు కరోనా సోకడం​ నిజమే.. కానీ' - అల్లు అరవింద్​ కరోనా

తనకు కరోనా సోకడం నిజమేనని స్పష్టం చేశారు నిర్మాత అల్లు అరవింద్​. అయితే తాను రెండు సార్లు వ్యాక్సిన్​ వేయించుకున్నా వైరస్​ సోకిందని వస్తున్న వార్తల్లో నిజంలేదని అన్నారు.

allu aravind
అల్లు అరవింద్​
author img

By

Published : Apr 5, 2021, 5:07 PM IST

రెండుసార్లు వ్యాక్సిన్‌ వేయించుకున్నా తనకు కరోనా వచ్చిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. తనకు వైరస్​ సోకిందని సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో స్పందించిన ఆయన.. ఓ దృశ్య సందేశాన్ని పోస్ట్​ చేశారు. తనకు కొవిడ్​ పాజిటివ్​గా తేలిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. అయితే అసలు జరిగింది వేరని వివరించారు.

  • Mega Producer #AlluAravind clarifies about #Covid +ve’ reports.

    I have observed that the effect of the virus on my body is very minimal. I here by urge everyone to get vaccinated,” he concluded. pic.twitter.com/QPZa7NqAbR

    — SKN (Sreenivasa Kumar) (@SKNonline) April 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"అందరికీ నమస్కారం.. నాకు కరోనా వచ్చిందంటూ వస్తున్న వార్తలపై స్పందించటం కోసమే మీ ముందుకు వచ్చాను. నాకు కరోనా వచ్చిన మాట నిజం. అయితే, రెండు వ్యాక్సిన్‌ డోస్‌ల తర్వాత కూడా నేను వైరస్​ బారిన పడినట్లు కొందరు రాస్తున్నారు. కానీ, అసలు జరిగింది ఏంటంటే.. నేను ఒక వ్యాక్సిన్‌ డోస్‌ తీసుకున్నా. తర్వాత మేం ముగ్గురం స్నేహితులు కలిసి ఊరెళ్లి వచ్చాం. ఆ తర్వాత మాకు కరోనా వచ్చిందని తెలుసుకున్నాం. నేను, మరొక వ్యక్తి మూడు రోజుల పాటు జ్వరంతో బాధపడ్డాం. మేమిద్దరం వ్యాక్సిన్‌ చేయించుకున్నాం. ఇంకొక వ్యక్తి ఆస్పత్రిలో చేరారు. ఈయన వ్యాక్సిన్‌ వేయించుకోలేదు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిపై కరోనా ప్రభావం అంతగా ఉండదు. అందుకు మేమే నిదర్శనం. వ్యాక్సిన్‌ తీసుకున్నా కరోనా రావొచ్చు. కొంచెం ఆలస్యం కావొచ్చు. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అందరూ తప్పకుండా వ్యాక్సిన్‌ వేయించుకోండి. దీని వల్ల ప్రాణహాని జరగకుండా చూసుకోవచ్చు" అని అల్లు అరవింద్‌ అన్నారు.

ఇదీ చూడండి: సినీ కార్మికులకు ఉచితంగా కరోనా టీకా: చిరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.