కామెడీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. 'గమ్యం', 'నేను', 'ప్రాణం', 'శంభో శివ శంభో' వంటి సినిమాల్లో విభిన్న పాత్రలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం 'నాంది', 'బంగారు బుల్లోడు' చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈరోజు నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
ఇందులో మరోసారి కామెడీతో అలరించాడు నరేష్. హాస్యంతో పాటు చివర్లో కాస్త సెంటిమెంట్ అంశాల్ని చూపించి సినిమాపై ఆసక్తిని పెంచింది చిత్రబృందం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పీవీ గిరి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర నిర్మించారు. పూజా జవేరి హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈరోజు 'నాంది' టీజర్‌ను కూడా విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో అమాయక ఖైదీ పాత్రలో కనిపించి అభిమానులను మరోసారి అబ్బురపరిచాడు నరేష్.