అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అల వైకుంఠపురములో'. సంక్రాంతి కానుకగా ఈనెల 12న విడుదలవనుందీ సినిమా. ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలలో బిజీగా ఉన్న చిత్రబృందం తాజాగా మేకింగ్ వీడియోను విడుదల చేసింది.
సెట్లో సందడి సందడిగా ఉన్న వాతావరణం నవ్వులు పూయిస్తోంది. సెట్లోకి వెంకీమామ అతిథిగా రాగా.. బన్నీ తనయుడు, తనయ అల్లు అయాన్, అర్హ సందడి చేశారు.
ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. టబు, జయరామ్, రాజేంద్రప్రసాద్, సముద్రఖని, నివేదా పేతురాజ్, మురళీ శర్మ, సుశాంత్, నవదీప్, సునీల్ వంటి భారీతారాగణం ఈ చిత్రంలో ఉంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ మూవీపై అంచనాల్ని పెంచేశాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చూడండి.. ఆమె చేయిస్తే.. అతడు ముద్దు పెట్టబోయాడు!