ETV Bharat / sitara

ఈటీవీతో మా అనుబంధం మాటల్లో చెప్పలేము! - హీరో తరుణ్​

ఈటీవీతో తమకున్న అనుబంధం మాటల్లో చెప్పలేనిదని అలనాటి తారలు రోజారమణి, చక్రపాణి తెలిపారు. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరాదాగా' కార్యక్రమానికి విచ్చేసిన ఈ దంపతులు ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

alitho saradaga
ఆలీతో సరాదాగా
author img

By

Published : Jul 13, 2021, 6:59 PM IST

ఈటీవీతో తమకు, తమ కుటుంబానికి ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిదని, అలనాటి తారలు రోజారమణి, చక్రపాణి అన్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా'కార్యక్రమానికి విచ్చేసిన ఈ దంపతులు ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు గ్రేట్‌ పర్సన్‌ అని, తరుణ్‌ను చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా'మనసు మమత'తో పరిచయం చేసిన ఆయన, హీరోగా'నువ్వే కావాలి'లాంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ ఇచ్చారని అన్నారు.

అలనాటి జ్ఞాపకాలు..

alitho saradaga
ఆలీతో సరాదాగా ప్రోగ్రాంలో అలనాటి తారలు

తనకు అలనాటి తార భానుమతి అంటే ఎంతో ఇష్టమని, ఆమె చాలా సరదాగా ఉండేవారని చక్రపాణి వివరించారు. రోజారమణిని రమణరావు అని పిలిచేవారని అప్పటి జ్ఞాపకాలను నవ్వుతూ పంచుకున్నారు. ఇక చిన్నప్పుడు తనకు పౌడర్‌ తినే అలవాటు ఉందని రోజారమణి చెప్పుకొచ్చారు. న్యూజిలాండ్‌లో అగర్‌బత్తులు వెలిగించి పూజ చేస్తే, అగ్నిప్రమాదం జరిగిందేమోనని పోలీసులు వచ్చారని రోజారమణి చెప్పారు.

'భక్తప్రహ్లాద'లో తాను నటిస్తే.. భక్తి తన భర్త, కొడుకుకు వచ్చిందన్నారు. ఇలా ఈ జంట పంచుకున్న అలనాటి మధుర జ్ఞాపకాలు, ఆసక్తికర విషయాలు తెలియాలంటే వచ్చే సోమవారం(జులై 19) వరకు వేచి చూడాల్సిందే. అప్పటివరకు ఈ ప్రోమో చూసేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: OTT Movies: ఈ వారంలో రాబోతున్న ఓటీటీ చిత్రాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.