తనను తీర్చిదిద్దేందుకు తన తల్లి జీవితాన్ని త్యాగం చేసిందని గుర్తుచేసుకున్నారు సంగీత దర్శకుడు తమన్. తనకోసం 14ఏళ్ల పాటు కూతురికి దూరంగా ఉంటూ చాలా కష్టపడిందని అన్నారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసిన ఆయన కెరీర్‌తో పాటు తనపై వచ్చిన ట్రోల్స్ గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
'నేను ట్యూన్ కాపీ కొడితే మా అమ్మ నాకు అన్నం పెడుతుందా?' అని అన్న మాట చాలా వైరల్ అయింది. ఇన్ని బ్లాక్ బస్టర్లు ఇస్తున్నావుగా మీ అమ్మ నీకు ఏం భోజనం పెడుతుంది? అని అలీ అడగగా తమన్ ఈ సమాధానం చెప్పారు.
"నిజం చెప్పాలంటే ఆమె నాకు భోజనం పెట్టడం ఏంటి? నేనే ఆమెకు భోజనం పెట్టాలి. పెడుతున్నాను. నా కోసం తను చాలా కష్టపడింది. అందరికీ ఇదే చెప్తాను. 'మీ అమ్మకు నువ్వు పెట్టరా.' ట్రోల్స్ చేసే ప్రతిఒక్కరికీ ఇదే నా సమాధానం. మనం సంపాదించి వారికి పెట్టాలి. ఎందుకంటే ఆమె నా కోసం చాలా కష్టపడింది. 38ఏళ్లలో ఆమె అనుకొని ఉంటే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. కానీ నాపై నమ్మకం ఉంచి మా చెల్లిని దూరం చేసుకుని పుట్టపర్తిలో ఉంచి చదివించింది. 14ఏళ్ల పాటు కుతురిని దూరం చేసుకుంది. ప్రతి మూడు నెలలకు అక్కడికి వెళ్లి వచ్చేది. నేను పనిచేసే వృత్తివల్ల చెడిపోయే అవకాశం ఉందని, నాతోనే ఉండేది. అందుకే ఆమె కోల్పోయినా 20 ఏళ్ల జీవితాన్ని తిరిగి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా."
తమన్ ఎక్కువగా సాంగ్స్ కాపీ కొడతాడు? ఇలాంటివి విన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి?
డైరెక్టర్, హీరోలు, ప్రొడ్యూసర్స్ నన్ను నమ్మినప్పుడు వాళ్లు నా ఆలోచనలోనే ఉండరు. నేనంత కష్టపడుతున్నానో వాళ్లు చూస్తున్నారు. కాబట్టి ట్రోల్స్‌ను అసలు పట్టించుకోను. లైఫ్‌లో పాజిటివిటీ ఉన్నప్పుడు నెగటివిటీ కూడా ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాను. నాపై ట్రోలింగ్ చేసుకుంటే వాళ్లకు డబ్బులు వస్తున్నాయి. దాంతో వాళ్లు బతుకుతున్నారు.
ఎవరిపైన కోపం వచ్చినా, ఎవరితోనైనా గొడవ పడినా గ్రౌండ్‌కు వెళ్లి క్రికెట్ ఆడతావు అంటా?
రాత్రి 12 గంటలలోపు ఆ సమస్యను పరిష్కరించుకుంటా. నా తప్పు ఉంటే వాళ్ల కాళ్ల మీద పడిపోతా. ఎందుకంటే తర్వాత రోజు మనం లేస్తామో లేదో తెలియదు. అమ్మ, భార్య, నా కొడుకు, ఎవరైనా సరే రాత్రిలోపు ప్రాబ్లమ్‌ను పరిష్కరించుకుంటా. మరుసటి రోజును కొత్తగా ప్రారంభిస్తా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'మీమర్స్ కంటే అమ్మే ఎక్కువ ట్రోల్ చేస్తుంది'