ETV Bharat / sitara

ఫోర్జరీ సంతకంతో దొరికిపోయిన అవసరాల శ్రీనివాస్​!

నటుడిగా, దర్శకుడిగా, రచయితగా రాణిస్తున్న అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas) గతంలో ఫోర్జరీ సంతకం చేసి దొరికిపోయినట్లు తెలిపారు. దీంతోపాటే 'నూటొక్క జిల్లాల అందగాడు' షూటింగ్​ సమయంలో తనకు జరిగిన ప్రమాదం గురించి వెల్లడించారు.

avasarala srinivs
అవసరాల శ్రీనివాస్​
author img

By

Published : Sep 7, 2021, 1:47 PM IST

'అష్టా-చమ్మా'తో వెండితెరకు పరిచయమై ప్రస్తుతం విభిన్న పాత్రలతో అలరిస్తున్న నటుడు అవసరాల శ్రీనివాస్​. దర్శకుడిగానూ రాణిస్తున్నారు. ఇటీవలే 'నూటొక్క జిల్లాల అందగాడు'(nootokka jillala andagadu release date) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా(Alitho saradaga latest episode) కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ చిత్రం సహా కెరీర్​ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ క్రమంలోనే తాను గతంలో ఫోర్జరీ సంతకం పెట్టి దొరికిపోయినట్లు వెల్లడించారు.

'ఓ పవర్​ఫుల్​ డాక్యుమెంట్​ ఒకటి ఉంది. ఓ ఐఏఎస్​ ఆఫీసర్​ సంతకం పెట్టాలి. నువ్వు ఫోర్జరీ సంతకాలు బాగా పెడతావంటగా' అని అలీ అడగ్గా.. శ్రీనివాస్​ ఈ విషయాన్ని చెప్పారు.

"అవును. చదువుకునేటప్పుడు ఓ సారి నాతో పాటు మిగతా ఫ్రెండ్స్​కు మార్కులు​​ సరిగ్గా రాలేదు. ఆన్సర్​ షీట్​ ఇచ్చి ఇంటికెళ్లి పేరెంట్స్​ చేత సంతకం పెట్టించుకురమ్మన్నారు. ఇంటిదాకా వెళ్లి సంతకం పెట్టించుకోవడం ఎందుకని క్లాస్​రూమ్​లోనే పెట్టేశా. మా స్నేహితులు కూడా వాళ్ల వాళ్ల నాన్న పేర్లు చెప్పి సైన్​ పెట్టించుకున్నారు. అయితే మా టీచర్​..'ఆన్సర్​ ఒకటి కరెక్ట్​ చేసి ఎక్స్​ట్రా మార్క్​లు వేస్తా. ఆన్సర్​ షీట్​ తిరిగి ఇవ్వండి' అని వెనక్కి తీసుకున్నారు. అదే పీరియడ్​లో ఆన్సర్​ షీట్​లో సంతకాలు ఎలా వచ్చాయని చిన్న డిస్కషన్​ జరిగింది. కానీ ఆమె మమల్ని క్షమించారు."

-అవసరాల శ్రీనివాస్​, నటుడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దర్శకుడు క్రిష్ ఫిర్యాదు.. షూటింగ్​లో ప్రమాదం!

శ్రీనివాస్​ నటించిన 'నూటొక్క జిల్లాల అందగాడు' సినిమా నిర్మాతల్లో దర్శకుడు క్రిష్​ ఒకరు. ఈ మూవీ విశేషాల గురించి అలీ మాట్లాడుతూ.. 'క్రిష్​.. సినిమా పరంగా కాకుండా నీ మీద ఫిర్యాదు చేశారు. నీ గురించి హ్యాపీగా లేరని చెప్పారు' అని అలీ అన్నారు. అనంతరం వీడియో కాల్​ ద్వారా క్రిష్​తో ఈ విషయం గురించి మాట్లాడారు. 'జార్జియాలో ఈ సినిమా షూటింగ్​ జరిగేటప్పుడు ఓ గమ్మతైన, కష్టమైన విషయం జరిగింది. జార్జియన్​ భాషలో 'స్ఖాలి' నే పదానికి శ్రీనివాస్​ను అడిగి తెలుసుకోండి' అని చెప్పి వెళ్లిపోయారు.

"స్ఖాలీ అంటే నీళ్లు. ఇది నాకు ఆలస్యంగా తెలియడం వల్ల ఓ చిన్న ప్రమాదం కూడా జరిగింది. ఓ చిన్న ఎండిపోయిన నదిలో షూట్​ చేస్తున్నారు. అందులో రాళ్లు,రప్పలు ఉన్నాయి. షూట్​ జరుగుతుండగా.. అందరూ స్ఖాలీ అని అరుస్తున్నారు. నాకు అర్థం కాలేదు. నా ముందు ఉన్న ఓ ట్రక్​ కంగారుగా బయలుదేరుతుంది. నేను అది ఎక్కేశా. ఆ తర్వాత పక్కకు తిరిగి చూస్తే ఆ నది నిండిపోయి నీళ్లు వచ్చేస్తున్నాయి. అప్పటివరకు చాలా పెద్ద వర్షం పడింది. మేము మధ్యలో ఉన్నాం. జీపు మీద కూర్చుంటే అయ్యే పనికాదు లేచి దిగుదామని నిలబడ్డా. జీపు వేగంగా టేకాఫ్​ అవ్వడం వల్ల కింద పడిపోయా. చెయ్యి విరిగిపోయింది. దీంతో చివరి మూడు రోజుల షూట్​ చెయ్యలేకపోయా. స్ఖాలి అంటే నీళ్లు అని తెలుసుంటే ముందే జీపు ఎక్కేవాడిని కాదు. తర్వాత ఆస్పత్రికి వెళ్తే చెయ్యి బాగా విరిగిందని అర్థమైంది" అని శ్రీనివాస్​ బదులిచ్చారు.

ఈ సినిమాలో బట్టతలతో కనిపించేందుకు నిజంగానే గుండు చేయించుకున్నానని శ్రీనివాస్‌ అన్నారు. ఈ చిత్రానికి ఆయనే కథ అందించగా.. విద్యాసాగర్‌(కొత్త దర్శకుడు) తెరకెక్కించారు. సెప్టెంబరు 3న ఈ చిత్రం థియేటర్‌లై మంచి .టాక్​తో ఆడుతోంది.

ఇదీ చూడండి: 'ఇంకెప్పుడూ నన్ను సినిమాలు చేయొద్దన్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.