సుమ కనకాల.. యాంకరింగ్ కుటుంబంలో ఆమె శివగామిలాంటి వ్యక్తి. ప్రదీప్ మాచిరాజు.. పంచులతో, తన ఎనర్జీతో ఆకట్టుకుంటున్న యువ యాంకర్. ఈ యాంకరింగ్ ద్వయం ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' టాక్ షోకు అతిథులుగా వచ్చి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఇందులో భాగంగానే.. ఆలీ అడిగిన ప్రశ్నలకు సుమ మార్క్ పంచ్‌లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.
'టిక్‌టాక్ వీడియోలు చేశావా' అని ఆలీ అడగగా.. సుమ చేయలేదని చెప్పింది. ఈ క్రమంలోనే సుమ పాడిన.. ప్రదీప్ హీరోగా నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' చిత్రంలోని 'నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా' పాట వీడియోను ప్లే చేశారు ఆలీ. అయితే నిజానికి ఈ పాటను అప్పుడు గాయని సునీతనే పాడగా.. సుమ హాస్యభరితమైన ముఖకవళికలు ఇస్తూ నటించారు. ఈ వీడియోను చూసిన వారెవరైనా విపరీతంగా నవ్వుకోవాల్సిందే. అంతలా కామెడీ చేశారు సుమ. ఇదంతా వారిద్దరూ కలిసి విజయవాడకు విమానంలో వెళ్తోన్న సందర్భంలో జరిగింది. ఆ వీడియోనూ మీరూ చూసేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి :