ETV Bharat / sitara

'మోహన్ బాబుతో అందుకే సినిమా చేయలేదు' - జీవిత

Alitho Saradaga Latest Episode: 'అంకుశం' సినిమాలో డైరెక్టర్ చెబితేనే రామిరెడ్డిని కొట్టినట్లు చెప్పారు సీనియర్​ హీరో రాజశేఖర్. 'ఆలీతో సరదాగా' షోకు వచ్చిన సందర్భంగా పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. మోహన్​బాబుతో కలిసి ఎందుకు సినిమా చేయలేదన్న ప్రశ్నపై క్లారిటీ ఇచ్చారు.

మోహన్​ బాబు, రాజశేఖర్​
Mohan babu, Rajasekhar
author img

By

Published : Jan 11, 2022, 11:23 AM IST

Alitho Saradaga Latest Episode: రాజశేఖర్‌ కథానాయకుడిగా ఆయన సతీమణి జీవిత తెరకెక్కిస్తున్న చిత్రం 'శేఖర్‌' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసిన జీవితా రాజశేఖర్‌ దంపతులు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. డైలాగ్​ కింగ్​ మోహన్​బాబుతో కలిసి ఎందుకు సినిమా చేయలేదో వివరించారు.

'హనుమన్​ జంక్షన్' సినిమాకు మోహన్​బాబు, రాజశేఖర్ కాంబినేషన్​ ఎందుకు మిస్సైంది?

"ఎందుకు కుదరలేదంటే.. వారేమో కచ్చితంగా టైమ్​ అంటే టైమ్​కి వస్తారు. నేను 9 గంటలకు రమ్మంటే 10 గంటలకు వెళ్తాను. అదే విషయాన్ని ఎడిటర్ మోహన్​, మోహన్​ బాబుగారికి చెప్పాను. 'ఇది మన మధ్య అపార్థాలకు దారి తీస్తుంది. ఇరువురి మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. కాబట్టి చేయకుండా ఉంటే బాగుంటుంది' అని ఎడిటర్​ మోహన్​, మోహన్​బాబుకు చెప్పి వద్దనుకున్నాం. అంతకు మించి వేరే ఏం లేదు" అని రాజశేఖర్​ చెప్పారు.

రామిరెడ్డి గారిని కొట్టుకుంటూ తీసుకెళ్లమంటే.. నిజంగానే కొట్టేశారంటా?

"అవునవును. ఎందుకంటే.. రామిరెడ్డిగారు దెబ్బలు తిన్నట్లు యాక్ట్​ చేసి నడవాలి. ఆయన సాధారణంగానే చాలా సున్నితమైన వ్యక్తి. ఎవరి చేత మాటపడే వ్యక్తి కాదు. చాలా ప్రెస్టేజెస్​గా ఉండే వ్యక్తి. నేను కొట్టినట్లు యాక్ట్​ చేస్తే.. దానికి ఆయన రియాక్షన్​ ఇవ్వాలి. అయితే నేనే కొట్టినట్లు నటిస్తున్నాను.. కానీ ఆయన ఎలాంటి రియాక్షన్​ ఇవ్వలేదు. దీంతో డైరెక్టర్​ కోడి రామకృష్ణగారు కొంచెం కొట్టమన్నారు. రామకృష్ణగారు చెప్పినట్లు నిజంగానే కొట్టా.. అప్పుడు ఆయన కదిలారు. వేరే దారి లేక అలా చేసి ఆ సీన్​ షూటింగ్​ పూర్తి చేశాం" అని వివరించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'ఈ చిత్రంలో ఎవ్వరూ చెప్పని ఓ అంశాన్ని చూపించాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.