ETV Bharat / sitara

అగరబత్తీల వ్యాపారంలోకి ఆలియా భట్​ - alia bhatt

ఇప్పటికే నిర్మాతగా మారిన బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ ఆలియా భట్(alia bhatt business)​ మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. అగరబత్తీలు తయారు చేసే ఓ అంకుర సంస్థలో పెట్టుబడులను పెట్టింది.

alia
ఆలియాభట్​
author img

By

Published : Oct 12, 2021, 2:35 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ ఆలియా భట్(alia bhatt business)​ వరుస సినిమాల్లో నటిస్తూ కెరీర్​లో దూసుకెళ్తోంది. ఓ వైపు నటిస్తూనే మరోవైపు నిర్మాతగానూ మారింది. ఇప్పుడు మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. అగరబత్తీలు, బయోలెదర్​ తయారు చేసే ఓ అంకుర సంస్థలో పెట్టుబడులను పెట్టింది. ఇందులో ఇన్వెస్ట్ చేయడం సంతోషంగా ఉందని చెప్పింది.

2017లో ఓ ఇంజినీరింగ్​ గ్రాడ్యుయేట్ అంకిత్​ అగర్వాల్​.. ​ ఈ అంకుర సంస్థను స్థాపించాడు. ఇప్పటికే ఈ స్టార్టప్​ కంపెనీ సీడ్​ ఫండింగ్ ద్వారా దాదాపు 2 మిలియన్ల డాలర్లను​ ఐఐటీ కాన్పూర్​, ఐఏఎన్ ఫండ్​, సోషల్​ అల్ఫా ఎప్​ఐఎస్​ఈ, డ్రాపర్​ రిచర్డ్స్​ కల్పన్​ ఫౌండేషన్​ నుంచి సేకరించింది. ఈ స్టార్టప్​ ఇప్పటికే ఫెయిర్​ ట్రేడ్​ అండ్​ ఎకోసర్ట్​ ఆర్గానిక్​ అండ్​ నేచురల్​ సర్టిఫికేట్​ను పొందింది.

ఈ స్టార్టప్​ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం గురించి ఆలియా మాట్లాడుతూ.. "పూలను రీసైక్లింగ్​ చేసి అగరబత్తీ, బయో లెదర్​ను తయారుచేయడమనే ఆలోచన నాకు నచ్చింది. ఈ ప్రక్రియ ఎకో ఫ్రండ్లీ. దీనిద్వారా నదులు శుభ్రంగా ఉంటాయి. ఇక ఈ కంపెనీ వల్ల ఎంతోమంది మహిళలకు ఉపాధి కలుగుతుంది" అని చెప్పింది.

త్వరలోనే రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్ఆర్'​(Aliabhatt RRR movie) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఆలియా. దీంతో పాటే ప్రస్తుతం పలు చిత్రాల్లోనూ నటిస్తోంది.

ఇదీ చూడండి: Alia Bhatt: ఆలియా సెట్​కు ఎందుకు వెళ్లేదో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.